Shocking: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. లక్నోలోని ఒక హోటల్‌లో తన తల్లిని నలుగురు చెల్లెళ్లను ఓ వ్యక్తి ఘోరంగా హత్య చేశాడు. 24 ఏళ్ల వ్యక్తి తన చెల్లెళ్లు ‘‘అమ్మబడటం’’ ఇష్టం లేకనే హత్యలు చేశానని చెప్పడం సంచలనంగా మారింది. హత్యలు చేసిన తర్వాత హత్యలకు కారణాలను ఓ వీడియోలో చెప్పాడు. అర్షద్ అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడ్డాడు. అర్షద్ సొంతూరు బుదౌన్‌లోని పొరుగువారు, ల్యాండ్ మాఫియా కలిసి తమ ఇంటిని స్వాధీనం చేసుకున్నారని, తన చెల్లెళ్లను నిర్బంధించాలని ప్లాన్ చేసినట్లు ఆరోపించారు.
వీడియోలో మాట్లాడుతూ.. అర్షద్ తన తల్లి, సోదరీమణులను చంపినట్లు చెప్పడంతో పాటు మృతదేహాలను కూడా చూపించాడు. నలుగురి మణికట్టు కోసి చంపేశాడు. దీనికి తన తండ్రి సాయం చేశాడని చెప్పాడు. మృతులను అతని తల్లి అస్మా, సోదరీమణులు అలియా (9), అల్షియా (19), అక్సా (16), రహ్మీన్ (18)గా గుర్తించారు.‘‘ఇరుగుపొరుగు వారి వేధింపుల కారణంగా మా కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. నేనే మా అమ్మ, చెల్లెళ్లని చంపాను. ఈ వీడియో పోలీసులకు దొరికిన సమయంలో, ఈ ఘటనకు స్థానికులు బాధ్యులని తెలుసుకోవాలి. వారు మా ఇంటిని కబ్జా చేసి వేధించారు. మా మాటని ఎవరూ పట్టించుకోలేదు. గత 15 రోజులుగా మేమంతా ఫుట్‌పాత్‌పై చలిలో నిద్రపోతున్నాము. మా ఇంటిని తీసేసుకున్నారు. పత్రాలు మా వద్ద ఉన్నాయి’’ అని అర్షద్ చెప్పాడు.
Read Also: 26/11 Mumbai Attack: త్వరలో భారత్‌కు.. 26/11 ముంబై దాడిలో ప్రమేయం ఉన్న ఉగ్రవాది!
వీడియోలో.. యువకుడి కుటుంబం మతం మారాలని కోరుకున్నట్లు చెప్పాడు. న్యాయం కోసం ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి విజ్ఞప్తి చేశాడు. ఈ మరణాలకు కారణమైన వ్యక్తులు – రాను, అఫ్తాబ్, అలీమ్ ఖాన్, సలీం, ఆరిఫ్, అహ్మద్ మరియు అజార్ అని చెప్పాడు. వీళ్లు ల్యాండ్ మాఫియాతో పాటు ఆడపిల్లల్ని కూడా అమ్మేస్తారని ఆరోపించారు. తనను తన తండ్రిని తప్పుడు కేసుల్లో ఇరికించి, తన చెల్లెళ్లని అమ్మాలని ప్లాన్ చేశారని, అది మాకు ఇష్టం లేదు, అందుకే చంపేశానని చెప్పాడు.
తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు, తెల్లవారుజాము వరకు బతికి ఉండకపోవచ్చని చెప్పాడు. తాము బంగ్లాదేశీయులమని తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు. తమ కుటుంబం శాంతియుతంగా జీవించేందుకు మతం మారాలని అర్షద్ వీడియోలో చెప్పాడు. తమకు సాయం చేయాలని చాలా మందిని వేడుకున్నా ఎవరూ సాయం చేయలేదని, భారతదేశంలో ఏ కుటుంబానికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దని చెప్పాడు. తమకు న్యాయం చేయాలని పీఎం మోడీని, సీఎం యోగిని కోరాడు. నిందితులకు రాజకీయ నేతలు, పోలీసులతో సంబంధం ఉందని ఆరోపించాడు. తన భూమిని ఆలయానికి, వస్తువులను అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని కోరాడు. నాకు వేరే ఛాయిస్ లేదని, వారిని హైదరాబాద్‌లో అమ్మాలని చూస్తున్నారని తన చెల్లెళ్ల గురించి చెప్పాడు.
అంతకుముందు, హోటల్ శరంజిత్‌లో హత్యలు జరిగాయని సెంట్రల్ లక్నో డిప్యూటీ కమిషనర్ రవీనా త్యాగి తెలిపారు. “అర్షద్ (24)గా గుర్తించబడిన నిందితుడు తన సొంత కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులను హతమార్చాడు. దీని తర్వాత సంఘటనా స్థలంలో అర్షద్‌ని అరెస్ట్ చేసినట్లు ఆమె చెప్పారు.