Maharashtra: మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, డిఫ్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సొంత ఇలాకాలో బీజేపీ ఓడిపోయింది. బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగ్‌పూర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి చేతిలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో నాగ్‌పూర్ స్థానం నుంచి ఎంవీఏ బలపరిచిన అభ్యర్థి సుధాకర్ అద్బలే విజయం సాధించారు. బీజేపీ మద్దతు ఉన్న నాగో గనార్ ఓడిపోయారు.
Read Also: PM Modi: ప్రధాని మోడీ విదేశీ ప్రయాణాల ఖర్చెంతో తెలుసా?
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను గద్దె దించి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన అసమ్మతి వర్గంతో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. బీజేపీ కూటమి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీలకు గట్టి పట్టున్న నాగ్‌పూర్ ప్రాంతంలో ఓడిపోవడం సంచలనంగా మారింది. ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి చేతిలో కాషాయ పార్టీ ఓడిపోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.
ఐదుగురు కౌన్సిల్ సభ్యుల ఆరేళ్ల పదవీ కాలం పూర్తవ్వడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో మూడు ఉపాధ్యాయ, రెండు గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. వీరందరి పదవీ కాలంలో ఫిబ్రవరి 7తో ముగుస్తోంది. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఔరంగాబాద్, నాగ్‌పూర్, కొంకణ్, నాగ్‌పూర్, నాసిక్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.