భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ఆటో మొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్స్ ను తీసుకొస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహన తయారీదారు విడా VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ బ్రాండ్ అయిన విడా, భారత మార్కెట్లో VX2 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తోంది. తయారీదారు ఇప్పుడు ఈ స్కూటర్ కొత్త వేరియంట్, VX2 గో 2.4 kWh ను విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్‌ను కేంద్ర…
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన రోడ్లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన రహదారులపై క్యూఆర్ కోడ్ స్కానర్లను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు.
EV Prices: ఢిల్లీలో 20వ FICCI ఉన్నత విద్యా సదస్సు 2025లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వెహికిల్స్ ధరకు సమానంగా మారతాయని తెలిపారు. మరో ఐదేళ్లలోపు, భారత్ లోని ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ 1గా మార్చడమే మా టార్గెట్ అన్నారు.
బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లభించకపోవడం దేవుడు తనకు ఇచ్చిన అతి పెద్ద వరం అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన హల్బా సమాజ్ మహాసంఘ్ స్వర్ణోత్సవ వేడుకల్లో నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించారు.
రీజినల్ రింగు రోడ్డుకు (నార్త్ పార్ట్) సంబంధించి 90 శాతం భూ సేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక, క్యాబినెట్ అనుమతి కోరారు. జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌కు అనగుణంగా రీజినల్ రింగు రోడ్డు (సౌత్ పార్ట్)కు అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కోరారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి…
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో సమావేశం అవుతారని సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రులను కలుసుకొని రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, అనుమతుల విషయాలపై ప్రస్తావించారు. ఫలితంగా, కొత్త ప్రాజెక్టుల రాకతో పాటు అనుమతులు వేగంగా మంజూరు అవుతున్నాయి. తాజాగా రాష్ట్రానికి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు…
Bhupender Yadav: బీజేపీ కొత్త జాతీయధ్యక్షుడి ఎంపిక కోసం రంగం సిద్ధం చేస్తోంది. సోమవారం, మరో రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించింది. మరో నాలుగు రాష్ట్రాలకు ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ రాజ్యాంగ ప్రకారం, జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు 37 స్టేట్ ఆర్గనైజేషన్స్‌లో కనీసం 19 రాష్ట్రాలలో అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. బీజేపీకి ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులు ఉన్నారు. వీరిలో కొందరు తిరిగి ఎన్నికయ్యారు. మంగళవారం నాటికి ఈ సంఖ్య…
Toll Tax: జూలై 15 నుండి జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు టోల్ చెల్లించాల్సి ఉంటుందనే వార్త చక్కర్లు కొడుతోంది. పలు మీడియా నివేదికలు కూడా ఈ విషయాన్ని హైలెట్ చేశాయి. అయితే, దీనిపై కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ఊహాగానాలను గురువారం ఆయన తోసిపుచ్చారు. ఇలాంటి నివేదికలు తప్పుదాడి పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు.
కేంద్రం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. రూ.3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యాక్టివేట్ చేసిన పాస్‌లు ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు (ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. అయితే.. ఇది ఎక్కడ లభిస్తుంది? ఈ వార్షిక పాస్ పొందేందుకు…
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. అవాంతరాలు లేని ప్రయాణం కోసం కేంద్రం సరికొత్త ఫాస్ట్‌ట్యాగ్ పాస్‌ను అందుబాటులోకి తెచ్చింది.