Supreme Court: ఇటీవల పోక్సో కేసు విచారణ సందర్భంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది. ‘‘వక్షోజాలను పట్టుకోవడం, పైజామా దారాలు తెంచడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం కాదు’’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఈ చర్యల్ని తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణిస్తామని చెప్పింది. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే, ఈ వ్యాఖ్యలపై మహిళలతో పాటు సమాజం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
Allahabad HC: లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ(పోక్సో) కేసును విచారిస్తున్న సందర్భంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి వక్షోజాలను పట్టుకోవడం, ఆమె పైజామా తాడు తెంచడం అత్యాచారం లేదా అత్యాచార యత్నం కాదని చెప్పింది. కానీ, ఇది తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణించబడుతుందని హైకోర్టు పేర్కొంది. కాస్గంజ్ లోని ప్రత్యేక న్యాయమూర్తి పోక్సో కోర్టు సమన్ల ఉత్తర్వులను జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిని సింగిల్ బెంచ్ సవరించి, కొత్త సమన్లు…