Air India: ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. రూ.90 లక్షలు ఫైన్.. దేనికోసమంటే..!
- ఎయిరిండియాకు డీజీసీఏ షాక్
- 90 లక్షలు జరిమానా
- భవిష్యత్‌లో జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్హత లేని సిబ్బందితో విమానాన్ని నడిపినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొరడా ఝుళిపించింది. శుక్రవారం భారీ మొత్తంలో జరిమానా విధించింది. రోస్టరింగ్ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకు ఎయిరిండియా సంస్థకు రూ.90 లక్షల జరిమానాను విధిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. దీంతో పాటు ఎయిర్‌ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్‌కు రూ.6 లక్షలు, ట్రైనింగ్ డైరెక్టర్‌కు రూ.3 లక్షలు ఫైన్ విధించింది. ఈ లోపాలపై సంస్థ ఇచ్చిన స్వచ్ఛంద నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత పైలట్‌ను హెచ్చరించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Modi-Zelenskyy: యుద్ధ పీడిత ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్‌కీ భుజం తట్టిన మోడీ.. భావోద్వేగం(వీడియో)
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
జులై 9వ తేదీన ఎయిర్‌ఇండియా ముంబై నుంచి రియాద్‌కు ఓ విమానం నడిపింది. ఆ విమానంలో ఓ ట్రైనింగ్ కెప్టెన్‌తో కలిసి ట్రైనీ పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే ట్రైనింగ్ కెప్టెన్ అనారోగ్యానికి గురికావడంతో రోస్టరింగ్ విధానంలో నార్మల్ లైన్ కెప్టెన్ విధుల్లోకి వెళ్లారు. ట్రైనీ పైలట్‌కు శిక్షణ ఇచ్చే అర్హత ఈ కెప్టెన్‌కు లేదు. సిబ్బంది నిర్వహణ వ్యవస్థలో లోపాల కారణంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ట్రైనీ పైలట్, కెప్టెన్ స్వచ్ఛందంగా బేస్ మేనేజర్‌కు రిపోర్ట్ చేశారు. అనంతరం ఎయిర్‌లైన్ దీనిపై డీజీసీఏకు వాలంటరీగా నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏవియేషన్ రెగ్యులేటరీ.. ఎయిర్‌ఇండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇది తీవ్రమైన భద్రతా లోపంగా పరిగణించిన డీసీజీఏ సంస్థకు జరిమానా విధించింది. భవిష్యత్తులో మరెప్పుడూ ఇలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పైలట్లను హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: AP Film Federation: ఇక ఏపీలో ఏ సినిమా షూటింగ్ జరిపినా మాకు చెప్పాల్సిందే!
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!