పోలాండ్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్‌కు చేరుకున్నారు. దాదాపు పది గంటల రైలు ప్రయాణం తర్వాత కీవ్ నగరంలో కాలు మోపారు. నగరంలోని భారతీయులను మోడీ కలిశారు. “భారత్ మాతాకీ జై ” అనే నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా వారు మోడీనికి స్వాగతం పలికారు. వారి యోగక్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడున్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. దాదాపు ఏడు గంటల పాటు ప్రధాని నగరంలో పర్యటించనున్నారు. ఈ సమయంలో మోడీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశంపై ఆ దేశంలో ఉత్కంఠ నెలకొంది.
READ MORE: AP Film Federation: ఇక ఏపీలో ఏ సినిమా షూటింగ్ జరిపినా మాకు చెప్పాల్సిందే!
అంతకు ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధ పీడిత ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకోగా.. ఆయనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్వాగతం పలికారు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. రష్యా, ఉక్రెయిన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం పెరిగిన తరుణంలో మోడీ పర్యటన కీలకంగా మారనుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో నేతలిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు నాయకులు ముందుకు సాగారు. అక్కడ టీవీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. “మే 2022 లో ఖార్కివ్‌లో జరిగిన బాంబు దాడిలో 5 నెలల చిన్నారి మరణించింది.” అని టీవీ స్క్రీన్ పై రాశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమరులైన ఉక్రెయిన్ సైనికులకు ప్రధాని మోడీ నివాళులర్పించారు.
#Watch | PM @narendramodi and President Zelenskyy honour the memory of children at Martyrologist Exposition#PMModiInUkraine @meaindia @pmoindia pic.twitter.com/KCOqfGb85z
— DD News (@DDNewslive) August 23, 2024