Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో రూ.10, రూ.20 విలువ కలిగిన కరెన్సీ నోట్ల మన్నికను పెంచేందుకు ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం ప్రయోగాత్మకంగా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం 1934లోని సెక్షన్ 25 ప్రకారం పంపిన ఈ ప్రతిపాదన ఆధారంగా.. మొత్తం 200 కోట్ల పాలిమర్ నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ధృవీకరించారు. కాగితపు నోట్లతో పాటు సమాంతరంగా ఈ పాలిమర్ నోట్లు చలామణిలో ఉంటాయని ఆమె వివరించారు.
ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్నందున, అధికారిక విడుదల తేదీ లేదా ఖర్చు వివరాలను ఇంకా నిర్ణయించలేదు. తదుపరి ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి వీటిని చలామణిలోకి తెచ్చేలా ఆర్బీఐ ప్రణాళికలు రచిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో గత 30 ఏళ్లుగా పాలిమర్ నోట్లు విజయవంతంగా వాడుకలో ఉన్నాయి. కాగితపు నోట్లతో పోలిస్తే ఇవి 2 నుండి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటమే కాకుండా, తక్కువ విలువ కలిగిన నోట్లు త్వరగా చిరిగిపోకుండా అరికడతాయి.
Also Read
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
ఇదే సందర్భంలో దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన ఆర్థిక మంత్రి, దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరాల్లో తగ్గుముఖం పట్టిన రిటైల్ ద్రవ్యోల్బణం, పశ్చిమాసియా సంక్షోభం, వాతావరణ మార్పుల కారణంగా 2026-27 మొదటి త్రైమాసికంలో 3.9 శాతానికి చేరినప్పటికీ, ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం పరిమితి లోపే ఉందని స్పష్టం చేశారు. అలాగే.. జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ ద్వారా పన్ను భారాన్ని తగ్గించామని, వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రజల వ్యయ సామర్థ్యం పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రైవేట్ వినియోగ వ్యయం పుంజుకోవడంతో పాటు, తక్కువ మరియు మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తికి రక్షణ లభిస్తోందని మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
-
Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
-
CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!