Achyutha Rao Elected as Chairman of AP Film Industries Employees Federation: ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం గాంధీ నగర్ లోని ఒక హోటల్ లో జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ నూతన చైర్మన్ గా కంచర్ల అచ్యుతరావును ఎన్నుకున్నారు సభ్యులు. ఇక ఈ క్రమంలో ఫెడరేషన్ అధ్యక్షుడు తోరం రాజా మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని, చిత్ర పరిశ్రమకు బాసటగా నిలవాలని మద్రాస్ నుండి హైదరాబాద్ కు తీసుకురావడం జరిగిందని అన్నారు. 2013 వరకు హైదరాబాద్ లో ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెంది ఎంతో మంది కార్మికులకు చేయూత ఇచ్చిందని అన్నారు. ఇక ఈ రోజు కంచర్ల అచ్యుత రావు ను చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగిందన్న ఆయన ఏపీ లో చలనచిత్ర పరిశ్రమ ను అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాని అన్నారు.
Parakramam Review: పరాక్రమం సినిమా రివ్యూ
29వ తేదీన ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తారని రాజా వెల్లడించారు. ఇక ఫెడరేషన్ నూతన చైర్మన్ గా ఎన్నికైన అచ్యుత రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి సినిమా వాళ్లంటే మక్కువ అని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడాలని లక్ష్యంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ఏ సినిమా షూటింగ్ జరిపినా ఫెడరేషన్ దృష్టికి తీసుకురావాలని, 24 క్రాఫ్ట్స్ ఆర్టిస్ట్ లకు ఇచ్చే కార్డులను ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడం వల్ల మన ప్రభుత్వానికి సహకారం అందించినట్లు ఉంటుందని ఆయన అభిప్రాయం పడ్డారు.