అర్హత లేని సిబ్బందితో విమానాన్ని నడిపినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొరడా ఝుళిపించింది. శుక్రవారం భారీ మొత్తంలో జరిమానా విధించింది. రోస్టరింగ్ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకు ఎయిరిండియా సంస్థకు రూ.90 లక్షల జరిమానాను విధిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది.