NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 40 వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. నిన్ను చూడాలని అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. పాత్ర ఏదైనా, భాష ఏదైనా..ఎన్టీఆర్ దిగనంతవరకే. నటుడిగా, సింగర్ గా, డ్యాన్సర్ గా, రాజకీయ ప్రచార కర్తగా అన్ని కళలను అవపోసన పట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు. తాత ఎన్టీఆర్ పేరు, పోలికలతో ఇండస్ట్రీకి పరిచయమై ఆయన లెగెసీని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎన్టీఆర్అభిమానులు అయితే తారక్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తూ.. సింహాద్రి రీరిలీజ్ లో రచ్చ రచ్చ చేశారు. తాజాగా తన పుట్టినరోజుకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఓకే నోట్ ను రిలీజ్ చేస్తూ.. అభిమానులకు ఋణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ అయ్యాడు.
Naga Chaitanya: మా తాత.. ఎన్టీఆర్ గురించి ఇంట్లో అలా చెప్పేవారు
“గత కొన్ని దశాబ్దాలుగా నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆ సమయంలో నా అభిమానులే నాకు యాంకర్, రాక్, మద్దతు స్తంభంగా నిలిచారు. నేను పోషించిన ప్రతి పాత్ర, నేను భాగమైన ప్రతి కథ నా అభిమానుల కోసమే. నాకు సపోర్ట్ గా నిలిచి, నేను చేసే ప్రతి కథను, ప్రతి పాత్రను ఆదరిస్తున్నందుకు, నిత్యం నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు.. విధేయతకు ప్రతి అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక దేవర పోస్టర్ కు మీరిచ్చిన స్పందన అద్భుతమైనది. దానికి మీకెప్పుడు కృతజ్ఞుడను. అది నా పుట్టినరోజును మరింత స్పెషల్ గా చేసింది. ఈ రోజును మరింత ప్రత్యేకంగా మార్చినందుకు నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మరియు తోటి సినీ సహోదర సభ్యులకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. ఎప్పుడు నీకు మేము తోడుగా ఉంటామన్నా అని హామీ ఇచ్చేస్తున్నారు.