Nandamuri Balakrishna: నందమూరి తారకరత్న అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. నందమూరి హీరోల అశ్రునయనాల మధ్య తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. ఇక అంత్యక్రియలు ముగియడానికి ముందు తారకరత్న పార్థివ దేహాన్ని చూడడానికి అభిమానులు వేలసంఖ్యలో తరలివచ్చారు. ఫిల్మ్ నగర్ ఛాంబర్ లో ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచిన సంగతి తెల్సిందే. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు, తారకరత్నను చివరి చూపు చూడడానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక అనుకోని సంఘటన ఎదురైంది.
Hansika Motwani: శింబుతో లవ్ అఫైర్.. పెళ్లి తరువాత నోరు విప్పిన దేశముదురు బ్యూటీ
అభిమానులతో పాటు తారకరత్నను చూడడానికి ఒక మతిస్థిమితం లేని వ్యక్తి వరుసకో నిలబడ్డాడు. తారకరత్న పార్థివ దేహాన్ని చూసిన అతను పక్కనే ఉన్న బాలకృష్ణతో ఏదో మాట్లాదాడు. బాలకృష్ణకు చేయి చూపి వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తున్నాడు. దానికి బాలకృష్ణ సైతం ఓకే ఓకే అంటూ తలాడిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇంకా ఏదో అతను మాట్లాడుతున్న లోపు పోలీసులు ఆ వ్యక్తిని బయటికి లాక్కెళ్లిపోయారు. అసలు ఆ వ్యక్తి ఎవరు..? బాలయ్యతో ఏం మాట్లాడాడు..? ఆయన అన్న మాటలకు బాలయ్య ఎందుకు ఎదురు చెప్పలేదు అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇంకొంతమంది “దైవం మానుష రూపేణ అని అంటారు… తారకరత్న గారు మహా శివరాత్రి రోజున శివైక్యం చెందారు...దైవం మనిషి రూపంలో కూడా రావొచ్చు…మతి స్థిమితం లేని వ్యక్తి వచ్చాడు అంటే ఆలోచించ తగిన విషయం…ఆ మహా శివుడు నానారూపాలలో దర్శనం ఇస్తాడు” అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.