Tollywood Heroines And Their Business: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ జీవితకాలం ఎంత అని అడిగితే ఎవ్వరూ చెప్పలేరు.నేటి తరం బ్యూటీలు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఫ్యూచర్లో ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండేందుకు బిజినెస్ ఉమెన్లుగా మారుతున్నారు. ఇప్పుడు ఆ హీరోయిన్స్ ఎవరు..? ఎలాంటి బిజినెస్లు చేస్తున్నారో చూద్దాం..
Pakistan: హిందూ డాక్టర్ గొంతు కోసి దారుణంగా హత్య చేసిన డ్రైవర్..
టాలీవుడ్ చందమామ అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇచ్చి అగ్రతారగా కాజల్ అగర్వాల్ వెలిగిపోయింది.సౌత్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. అయితే.. ఈ బ్యూటీ సినిమాలతోనే ఆగిపోలేదు. జ్యూయలరీ బిజినెన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మర్సలా అనే పేరుతో ఓ సంస్థను స్థాపించింది. తన సోదరితో కలిసి ఈ వ్యాపారాన్ కాజల్ అగర్వాల్ నిర్వహిస్తోంది. దాదాపు 22 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో ఇష్టం సినిమాతో శ్రియా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే వ్యాపార రంగంలోకి శ్రియాశరణ్ అడుగుపెట్టింది. శ్రీస్పందన అనే స్పా కంపెనీని స్టార్ట్ చేశారు. దేశంలో ఉన్న ఫేమస్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి.
MLC Elections : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్
మహానటి కీర్తీ సురేష్ కూడా వ్యాపారం రంగంలోకి అడుగుపెట్టింది. ఇటు హీరోయిన్ గా సత్తా చాటుతునే బిజినెస్ ను విస్తరిస్తున్నారు. ఈ రోజుల్లో అందం అగ్ర ప్రాధాన్యమైందిగా మారింది. ఆ రంగంలోనే వ్యాపారం ప్రారంభించారు. భూమిపుత్ర పేరుతో సొంతంగా ఓ స్కిన్ కేర్ బ్రాండ్ ను విడుదల చేసింది. ప్రకృతి సిద్దమైన వస్తువులతో తమ ప్రొడక్ట్స్ తయారవుతుందని కీర్తి సురేష్ తెలిపారు. తెలుగులో టాప్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. అయితే ఆఫ్ ది స్క్రీన్ రకుల్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది.. ఆమె ఫిట్నెస్.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వర్కవుట్స్ మానుకునేదే లేదంటుందీ రకుల్ ప్రీత్ సింగ్. వర్కవుట్స్ అంతగా ఇష్టపడే రకుల్.. దాన్నే బిజినేస్ గా మార్చుకుంది. F45 Fitness Health Hub అనే పేరుతో జిమ్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
Viral Video: బైక్ రైడర్ హెల్మెట్ పగలగొట్టిన ఆటోరిక్షా డ్రైవర్.. ఎందుకో తెలుసా?
దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోనూ వీటిని ఓపెన్ చేసింది. టాలీవుడ్ లో స్టార్ గా చెలామణి అయిన తమన్నా స్పీడ్ ప్రస్తుతం కాస్త తగ్గిందని చెప్పవచ్చు. హీరోయిన్ గా రాణిస్తున్న టైంలోనే వ్యాపారంలోకి దిగింది. 2015లో జ్యూయలరీ బిజినెస్ స్టార్ట్ చేసింది. వైట్ అండ్ గోల్డ్ పేరుతో వ్యాపారం ప్రారంభించింది. ప్రస్తుతం తమన్నా బిజినెస్ సక్సస్ పుల్ గా నడుస్తోంది. కమల్ హసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనదైన టాలెంట్ తో అగ్రతారగా శృతిహసన్ ఓ వెలుగు వెలిగింది. ఈ సంక్రాంతికి డబుల్ బొనాంజా అందుకున్న ఈ బ్యూటీ.. సలార్ రాణీగా రాబోతుంది. కెరియర్లో బిజీగా ఉన్న ఈ అందగత్తే.. సినమాతో సంబంధం ఉన్న బిజినెస్ లోకి దిగారు. యానిమేషన్స్ ఫిల్స్మ్, వీడియో రికార్డింగ్, ప్రొడక్షన్ హౌస్, షార్ట్ ఫిల్మ్స్ సంస్థను ప్రారంభించారు.
The Deccan Hospital: నేడు వరల్డ్ కిడ్నీ డే.. సమర్థవంతమైన చికిత్సతోనే కిడ్నీ వ్యాధులకు చెక్..
నాజూకు నడుము సుందరిగా పేరు తెచ్చుకున్న గోవా బ్యూటీ ఇలియానా కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ప్రస్తుతం ఇల్లీ బేబికి సినిమాలు పెద్దగా లేవు.. దీంతో బిజినెస్ మొదలు పెట్టింది. మంచి టూరిస్ట్ ప్లేస్ అయిన గోవాలోనే రెస్టారెంట్, బేకరీ రన్ చేస్తోంది. ఏరియా వైజ్ గా చైనా బిజినెస్ నడిపిస్తుంది. చారడేసి కళ్లతో మెరిసిపోయే బ్యూటీ ప్రణీత సుభాష్.. తెలుగులో పలు సినిమాలు చేసింది. పవన్ కల్యాణ్ సరసన అత్తారింటికి దారేది చిత్రంలో నటించింది. ఇకా.. కోలీవుడ్, శాండల్ వుడ్ లోనూ రాణించింది. ఆ తర్వాత సినిమాలు రాకపోవడంతో బిజినెస్ ఉమెన్ గా ప్రణీతా సుభాష్ మారిపోయింది. ఫస్ట్ బెంగళూరులో ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేసింది. అది సక్సస్ కావడంతో.. చెన్నై, హైదరాబాద్ లోనూ బ్రాంచీలు ఓపెన్ చేసింది. ఝమ్మంది నాదం సినిమాతో పాటు పలు చిత్రాల్లో హీరోయిన్ గా తాప్సీ పన్ను నటించారు. ఆ తర్వాత బాలీవుడ్ లో స్థిరపడిపోయింది. లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్లకు కేరాఫ్ గా మారింది. ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు మ్యారేజ్ ఈవెంట్స్ చేసే వ్యాపారంలోకి తాప్సీ దిగింది. ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే పేరుతో ఓ సంస్థను స్థాపించింది.