The Deccan Hospital: మార్చి 9న ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా జరుపుకుంటాము. మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన బాధ్యతలను నెరవేరుస్తాయి. రక్తంలోని చెడు పదార్థాలను తీసేస్తుంది. ఇటీవల కాలంలో కోవిడ్ -19 మహమ్మారి ప్రపంచం ఎదుర్కొన్న సవాళ్లకు స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, శ్వాసకోశ వ్యాధులు నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల జాబితాలో ఉన్నాయి. నాన్ కమ్యూనికేబుల్(ఎన్సీడీ) వ్యాధులు చాలా తరచుగా సరైన జీవనశైలి ఎంపికల కారణంగా తప్పుగా గుర్తించబడుతున్నాయి, తగినంత ప్రజారోగ్య నిధులను కేటాయించడం వలన నివారణ కంటే నిర్వహణపై దృష్టి పెడుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ ఎన్సీడీ వ్యాధుల్లో 55 శాతంగా ఉన్న వ్యాధులు, ఈ గ్రూపులో లేని కిడ్నీల వ్యాధులకు కారణం అవుతోంది. మూత్రపిండ వ్యాధులతో పాటు ఇతర ఎన్సీడీ వ్యాధులన నివారణ ముందస్తు గుర్తింపు, నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చే సమగ్ర ఆరోగ్య వ్యూహాలను అనుసరించాల్సిన అవసరం ఉంది.
⦁ ఎమర్జెన్సీ సందర్భాల్లో దీర్ఘకాలిక రోగుల సంరక్షణకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలి.
⦁ ప్రభుత్వాలు ఎన్సీడీల నిర్వహణ మరియు గుర్తింపులో అత్యవసర సంసిద్ధత ప్రణాళికలను చేర్చాలి, ఈ పరిస్థితుల నివారణకు
అనుకూలంగా ఉండాలి.
⦁ రోగులు ఆహారం, నీరు, వైద్య సామాగ్రి మరియు వైద్య రికార్డులతో కూడిన ఎమర్జెన్సీ కిట్‌ను సిద్ధం చేయడం ద్వారా అత్యవసర
పరిస్థితుల కోసం ప్లాన్ చేసుకోవాలి.
డెక్కన్ హాస్పిటల్ ఏటా ప్రపంచ కిడ్నీ దినోత్సవం
డెక్కన్ హాస్పిటర్ నెఫ్రాలజీ విభాగం పనితీరుపై నెఫ్రాలజీ హెడ్ ఎన్. పవన్ కుమార్ రావు మాట్లాడారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం గురించి డాక్టర్ ఎస్వీ. సుబ్రమణ్యం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులు, మూత్రపిండాల దాతలను సత్కరించారు. వారి కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు. రోగులకు, వారి బంధువులకు కిడ్నీ వ్యాధులపై క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
డెక్కన్ హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగం
డెక్కన్ హాస్పిటల్స్ అన్ని సమగ్ర నెఫ్రాలజీ సేవలను అందిస్తోంది. నెఫ్రాలజీ విభాగంలో 24×7 అందించడంలో డెక్కన్ హాస్పిటర్ ప్రసిద్ధి చెందింది. కేవలం నాలుగు గంటల్లోనే పీడీ కాథెటర్ ను ద్వారా పెరిటోనియల్ డయాలసిస్ లో ప్రారంభించడం ఈ హాస్పిటల్ ప్రత్యేకత. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో లోకల్ అనస్థీషియా ఇచ్చి పెరిటోనియల్ డయాలసిస్ చేస్తారు. సంప్రదాయ పద్దతిలో పీడీ కాథెటర్ శస్త్రచికిత్స అనంతరం పెరిటోనియల్ డయాలసిస్ చేసేందుకు 14 రోజుల సమయం తీసుకుంటారు. దీనిలా కాకుండా కేవలం 4 గంటల్లోనే ఈ పద్దతి ద్వారా డయాలసిస్ ప్రారంభిస్తారు. దీంతో పాటు హీమోడయాలసిస్ సెంటర్ ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్లకు హీమోడయలాసిస్ సేవలను అందిస్తోంది.
మూత్రపిండ మార్పిడి:
డెక్కన్ హాస్పిటల్ స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంట్‌లో అగ్రగామిగా ఉంది. దక్షిణ భారతదేశంలో మొదటి ఇంటర్-హాస్పిటల్ స్వాప్ మూత్రపిండ మార్పిడిని నిర్వహించింది. తరువాత డెక్కన్ హాస్పిటల్‌లో అనేక స్వాప్ మూత్రపిండ మార్పిడిలు జరిగాయి. బ్రెయిన్ డెడ్ అయిన దాతల నుంచి మూత్ర పిండాలు సేకరించి మాత్రపిండాల మార్పిడి చేయడంతో నిపుణులైన బృందాలను కలిగి ఉంది.
క్రిటికల్ కేర్..
డెక్కన్ హాస్పిటల్ ఇండిపెండెంట్ నెఫ్రాలజీ ఐసీయూని కలిగి ఉంది. ఇక్కడ మూత్ర పిండాల వ్యాధి ఉన్న వారికి అన్ని పద్దతుల్లో చికిత్సను అందిస్తున్నారు. డెక్కన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కామారెడ్డి, తాండూర్, వికారాబాద్, సిద్ధిపేట ప్రాంతాల్లో శాటిలైట్ కిడ్నీ సెంటర్లు ఉన్నాయి.