అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తల్లో.. ఏది నమ్మాలో నమ్మకూడదో అర్థం కాకుండా ఉంటుంది. లేటెస్ట్‌గా రాజాసాబ్ విషయంలోను ఇదే జరిగింది. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో రాజా సాబ్ పై సూపర్ హైప్ ఉంది. మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్‌లో ప్రభాస్ లుక్ కేక పెట్టించేలా ఉంది. అలాగే.. తమన్ ఇచ్చిన గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయింది. దీంతో.. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ పై గట్టి అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో.. రాజా సాబ్ ఆడియో హక్కులకు సంబంధించి కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
Lavanya: ముంబైలో మాల్వితో రాజ్ తరుణ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న లావణ్య
ఈ సినిమా ఆడియో హక్కులు 15 కోట్లకు అమ్ముడు పోయినట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ప్రముఖ నిర్మాత, మారుతీ ఫ్రెండ్ అయినటువంటి ఎస్‌కెఎన్ సోషల్ మీడియాలో.. రాజా సాబ్ ఆడియో రైట్స్ పై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ న్యూస్ నిజమా? కాదా? అని ఎస్‌కెఎన్‌ను ట్యాగ్ చేయగా.. ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. దీంతో.. రాజా సాబ్ ఆడియో రైట్స్ పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నమాట. ఇకపోతే.. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే.. హనురాఘవపూడి ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ప్రభాస్. ఈ ఏడాదిలో రాజా సాబ్ షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో.. మారుతి ఆ డేట్ టార్గెట్‌గా రాజాసాబ్‌ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. మరి మారుతి, ప్రభాస్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.