Lavanya Caught Raj Tarun with Malvi Malhotra at Mumbai: రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిజానికి ఈ ఉదయం తరుణ్- లావణ్య కేసులో నార్సింగి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ చార్జ్షీట్లో రాజ్తరుణ్ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్ తరుణ్ గడిపిన వాటికి సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు పోలీసులు, మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు హీరో రాజ్తరుణ్. లావణ్యతో పాటు రాజ్తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Lavanya: నేను రాజ్ తరుణ్ కలిసి డ్రగ్స్ తీసుకున్నాం.. బాంబు పేల్చిన లావణ్య
పదేళ్ల పాటు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారిని, లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయన్నారు నార్సింగి పోలీసులు. ఇది ఇలా ఉండగా రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది లావణ్య. ముంబైలో ఓ ఇంట్లో మాల్వితో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న లావణ్య, లావణ్యతో దూషణకు దిగినట్టు తెలుస్తోంది. తనని మోసం చేసి హీరోయిన్ మాల్వీ తో సహజీవనం చేస్తున్నాడు అంటూ లావణ్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో రహస్యంగా ఉంటున్నారని సమాచారంతో అక్కడికి వెళ్లి ఇద్దర్నీ పట్టుకున్న లావణ్య నా రాజ్ ను నాకు అప్పగించాలని మాల్వితో గొడవకు దిగినట్టు సమాచారం.