దాదాపు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న రైతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం గుడ్ న్యూస్ చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా జాతిని ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో “నేనేం చేసినా రైతుల కోసమే చేశాను.. నేను చేసేది దేశం కోసమే.. మీ ఆశీర్వాదంతో నా కష్టాన్ని ఏనాడూ వదలలేదు.. ఈ రోజు నేను మీకు భరోసా ఇస్తున్నాను. నేను ఇప్పుడు మరింత కష్టపడి పని చేస్తాను. తద్వారా మీ కలలు, దేశం కలలు సాకారమవుతాయి. మేము మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలలో ప్రక్రియను ప్రారంభిస్తాము” అని ప్రధాని మోదీ చెప్పారు. నిరసన తెలుపుతున్న రైతులను ఉద్దేశిస్తూ ‘ఇంటికి తిరిగి రండి, మళ్లీ ప్రారంభిద్దాం’ అని ఆయన కోరారు.
Read Also : ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్
ఈ వార్తలపై పలువురు రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా, సినీ ఇండస్ట్రీ నుంచి మొదటగా తాప్సీ రియాక్ట్ అయ్యింది. మోడీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన మీడియాలో వచ్చిన స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రైతులకు గురుపూరబ్ శుభాకాంక్షలు తెలిపింది. గురుపూరబ్ అంటే పంజాబీ, సిక్కు ప్రజలు ఘనంగా జరుపుకునే గురునానక్ పండగ. తాప్సి కూడా సిక్కు కావడంతో మొత్తం రైతు సంఘాన్ని, ప్రత్యేకించి పంజాబ్‌కు చెందిన రైతులను ప్రత్యేకంగా అభినందించడానికి ఇలా ట్వీట్ చేశారు. కాగా వ్యవసాయ చట్టాల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రధాని మోదీ మాస్టర్‌స్ట్రోక్‌గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also….. Gurpurab diyaan sab nu vadhaiyaan 🙏🏽 https://t.co/UgujPdw2Zw
— taapsee pannu (@taapsee) November 19, 2021