పంజాబ్‌తో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న బంధాన్ని ఇలాంటి నిరాధారమైన, అశాస్త్రీయమైన వ్యాఖ్యల ద్వారా అంచనా వేయవద్దని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ తెలిపారు.
Rahul Gandhi: రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యం ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంది. అయితే, దీనిపై రాజకీయ రగడ మాత్రం ఆగడం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కంగనా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకువస్తే ఇండియా…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ తీరుపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. స్నేహపూర్వకంగా వుండే రాష్ట్ర ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాలను అస్సలు పట్టించుకోరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రైతుల కోసం ఏం చేసినా కేంద్రానికి నచ్చదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ‘రైతు పోరాటానికి మా మద్దతు ఉంటుంది. తెలంగాణ ఏర్పడక ముందు కరెంట్ కోతలు తీవ్రంగా ఉండేవి. రోజుకు 10మంది రైతులు చనిపోయేవారు. వ్యవసాయంపై ఇప్పటికీ కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. మోటార్లకు మీటర్లు పెట్టాలని…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు… దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.. రైతులు నెలల తరబడి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగారు.. దీంతో.. కేంద్రం వెనక్కి తగ్గింది. అయితే, ఈ చట్టాలపై సుప్రీం ధర్మాసనం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక బహిర్గతమైంది. సాగు చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నందున… వాటిని రద్దు చేయవద్దంటూ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీయడంతో.. వీటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఈ…
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బిజెపి కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు కేటీఆర్. సాగు చట్టాలను రద్దు చేయడం.. మోడీ క్షమాపణలు చెప్పడం ఎన్నికల స్టంటేనని బీజేపీ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సాగు చట్టాలను రద్దు చేశామని మోడీ అంటారని… సాగు చట్టాలు మళ్లీ తెస్తామని కేంద్ర మంత్రి అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. బిజెపి రాజకీయాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన ఆందోళనకు ఏడాది దాటింది.. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ దిగివచ్చారు.. రైతులకు క్షమాపణలు చెప్పి.. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.. అయితే, మరికొన్ని డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.. కానీ, తాజా పరిస్థితి చూస్తుంటే ఆందోళన విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. తమ భవిష్యత్తు కార్యాచరణపై…
పార్లమెంట్ సమావేశాల్లో రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. రైతు మేలు కోసమే చట్టాలు తీసుకొచ్చామని, రైతులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రం స్పష్టం చేసింది. చట్టాలను వెనక్కి తీసుకున్నాక, రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేసిన సమయంలో 750 మంది మృతి చెందారు. వీరందరికీ కేంద్రం పరిహారం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. Read: ఒమిక్రాన్ కొత్త రూల్స్: ఎయిర్‌పోర్ట్‌లోనే 6 గంటలు… దీనిపై ఈరోజు కేంద్ర…
ఆందోల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతికిరన్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ… దేశంలో ప్రవేశపెట్టిన రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు హర్షం. కేంద్రం దిగివచ్చే విధంగా రైతులు పోరాటం చేశారు.ఇది రైతుల విజయం. ఈ రైతు చట్టాలు రైతుల జీవితాలను ఆగం చేస్తుందని తెరాస పార్టీ ముందుగానే గుర్తించి వెతిరేకించింది. కేంద్ర వైఖరిని నిరసిస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ ఎస్ పార్టీ ధర్నా చేసింది. రైతు విధానాల పట్ల బీజేపీ అవలంబిస్తున్న విధానాన్ని నిరసిస్తూ కేసీఆర్ చేసిన…
వ్యవసాయ చట్టాల రద్దుపై మొదటిసారిగా స్పందించిన వైసీపీ పార్టీ.. కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల విజయానికి మద్దతుగా… ఇవాళ ఏపీ వ్యాప్తంగా కొవ్వొత్తులతో ర్యాలీలు చేయాలని నిర్నయం తీసుకుంది. మహాత్మాగాంధీ స్పూర్తిని, శక్తిని ప్రతిబింబింపజేసేలా… భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఓ గొప్ప విజయాన్ని సాధించిన రైతాంగానికి మద్ధతుగా… ఈ రోజు సాయంత్రం రాష్ట్రంలోని 175 నియోజకవర్గంలో కొవ్వొత్తులతో రైతు సంఘీభావ ర్యాలీలు నిర్వహించవలసిందిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు…