‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రైజ్’ నుండి నాల్గవ సింగిల్ తాజాగా విడుదలైంది. స్టైలిష్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ మాస్ ఫీస్ట్ సాంగ్ “ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా” అనే టైటిల్‌తో విడుదలైంది. ఈ పాట తెలుగు వెర్షన్‌ను నకాష్ అజీజ్ పాడగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు. అభిమానుల అంచనాలను అందుకునేలా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #PushpaFourthSingle అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు. అయితే మిగతా వారు మాత్రం ఈ సాంగ్ అంచనాలను అందుకోలేకపోయింది అంటున్నారు. సినిమా నుంచి ఇప్పటి వరకు మూడు సింగిల్స్ ‘దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి’ సాంగ్ విడుదల కాగా, ఈ పాటలన్నీ హిట్ అయ్యాయి. ఇందులో ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ కు ముందుగా కొంచం నెగెటివిటీ వచ్చింది.

Read Also : ‘శ్యామ్ సింగ రాయ్’ స్టోరీ రివీల్ చేసేసిన నాని

కాగా “పుష్ప: ది రైజ్” ఈ ఏడాది డిసెంబర్ 17న విడుదల కానుంది. ఫహద్ ఫాసిల్ ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తుండగా, రష్మిక మందన్న కథానాయికగా కన్పించబోతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Latest Articles