Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య మాట్లాడుతూ.. రవితేజను 20 ఏళ్ల కిందట కలిశాను. నాకు అతనితో ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంది. అతని గురించి మా ఇంట్లో అప్పుడప్పుడు చర్చ జరుగుతుంది. రవితేజ ఎన్నో సవాళ్లను దాటుకుని ఈ స్థాయిలో నిలబడ్డాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేడు మాస్ మహారాజ దాకా వచ్చాడు.
Read Also : Rashmika : అప్పుడే చెప్తా.. విజయ్ తో ఎంగేజ్ మెంట్ పై రష్మిక రియాక్ట్
రవితేజ ఎనర్జీ, కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతని సినిమాలు మేం తమిళ్ లోనూ ఎంజాయ్ చేస్తుంటాం. అన్ని లాంగ్వేజెస్ వారికి నచ్చేలా నటించడం కొందరికే సాధ్యం. అది రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఇప్పుడు రవితేజ. ఆయన తమిళ ప్రేక్షకులను కూడా ఎంటర్ టైన్ చేస్తున్నారు. రవితేజ నటించిన చాలా సినిమాలు చూశాను. విక్రమార్కుడు నా ఫేవరెట్. ఆ సినిమాను తమిళ్ లో కార్తీ రీమేక్ చేసి కెరీర్ టర్నింగ్ హిట్ అందుకున్నాడు. ఈ మాస్ జాతర సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. అందులో నాకు డౌట్ లేదు. అక్టోబర్ 31న అందరూ థియేటర్లకు వెళ్లి మూవీని చూడండి అంటూ తెలిపాడు సూర్య.
Read Also : Mass Jathara : ఇది పెద్ద హిట్ అవుతుంది రాసిపెట్టుకోండి.. రవితేజ స్టేట్ మెంట్