Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో రవితేజ మాట్లాడుతూ.. శివుడి పాత్ర చేసిన నవీన్ అదరగొట్టాడు. అతను ఇలా కూడా చేస్తాడా అని మీరు థియేటర్ లో చూసి ఆశ్చర్యపోతారు. రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన సీన్స్ అదిరిపోతాయి. మా కాంబినేషన్ సీన్స్ మీరు మళ్లీ మళ్లీ కావాలంటారు. అలా ఉంటాయి. మేం మరో సినిమా చేయాలని కోరుకుంటున్నా.
Read Also : Rashmika : అది మంచిది కాదు.. వర్కింగ్ అవర్స్ పై రష్మిక కామెంట్స్
శ్రీలీలది నాది సూపర్ హిట్ కాంబినేషన్ అని సెట్స్ లో చెప్పేవాడిని. అదే నిజం కాబోతోంది. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. థియేటర్ లో చూసి మీరే ఎంజాయ్ చేస్తారు. కొత్త శ్రీలీల కనిపిస్తుంది మీకు. నాకు సూర్య అంటే చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత కలిశాం మేం. సూర్య గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిర్మాత నాగవంశీ చెప్పినట్టే ఈ మూవీ మంచి హిట్ అవుతుంది. భాను భోగవరపు రూపంలో మనకు మరో పెద్ద డైరెక్టర్ రాబోతున్నాడు అంటూ చెప్పాడు.
Read Also : Samantha : సమంత సినిమాలో విలన్ గా క్రేజీ యాక్టర్..