Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో స్పిరిట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇంకా మొదలు కాకముందే.. రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ మూవీ గురించి అప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. త్వరలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇందులో దీపిక పదుకొణెను తీసుకుంటారనే ప్రచారం మొదటి నుంచి జరిగింది. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. దీపిక ఇందులో నుంచి తప్పుకుందంట. ఆమె పెడుతున్న కండీషన్లు భరించలేక సందీప్ ఆమెను వద్దని చెప్పేసినట్టు తెలుస్తోంది. ఆమె స్థానంలో ఓ క్రేజీ హీరోయిన్ ను తీసుకువస్తున్నాడంట సందీప్ రెడ్డి.
Read Also : Agniveers: ఆపరేషన్ సిందూర్‌లో సత్తా చాటిన “అగ్నివీరులు”.. అంతా 20 ఏళ్ల లోపు వారే..
ప్రభాస్ పక్కన హైట్, అందం అన్నింటిలో సరితూగే మృణాల్ ఠాకూర్ తో చర్చలు జరుపుతున్నారంట. త్వరలోనే ఆమెను ఫిక్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా మృణాల్ కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు కాబట్టి అది కూడా మూవీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఇందులో ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రభాస్ ఫౌజీ, ది రాజాసాబ్ మూవీలను ఫినిష్ చేసే పనుల్లో ఉన్నాడు.
అవి రెండూ అయిపోయిన వెంటనే స్పిరిట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో కూడా సందీప్ అత్యంత వైలెంటిక్ యాక్షన్ సీన్లు రాసుకున్నాడంట. ప్రభాస్ హైట్ కు తగ్గట్టు భారీ యాక్షన్ సీన్లు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అసలే సందీప్ సినిమాలు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. పైగా ఆరడుగుల ప్రభాస్ హీరో కాబట్టి.. యాక్షన్ మీదనే మెయిన్ ఫోకస్ ఉండబోతోందంట.
Read Also : Hyderabad : ట్రాఫిక్ నియమాన్ని పాటించిన వీధి కుక్క… వీడియో వైరల్