Hyderabad : ట్రాఫిక్ నియమాన్ని పాటించిన వీధి కుక్క… వీడియో వైరల్
- వీడియోను పంచుకున్న ట్రాఫిక్ పోలీసులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుషులు కూడా అప్పుడప్పుడు జంతువుల తెలివితేటలను కళ్లకు కట్టినట్లు చూస్తారు. అవి చేసే పనులకు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇక కొన్ని జంతువులు అయితే ఊహకందని విధంగా తెలివితేటలకు ప్రదర్శిస్తాయి. కొన్ని జంతువులు ప్రమాదాలను ముందే గుర్తిస్తాయి. పైగా జంతువుల్లోని కమ్యూనికేషన్ ను చూస్తే తెగ ముచ్చటేస్తుంది. అయితే ఇలాంటి తెలివిగల అరుదైన జంతువులు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ తెలివైనా జంతువు హైదరాబాద్‌లో కనిపించింది. అదే వీధి కుక్క. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వీధి కుక్క తెలివిని ఎలా ప్రదర్శించిందని మీకు అనుమానం వచ్చే ఉంటుంది. కొందరి మనుషులకంటే ఆ కుక్క చాలా బెటర్ అనే విధంగా మన్ననలు పొందింది.
READ MORE: Jyoti Malhotra: ‘‘గూఢచారి’’ జ్యోతి మల్హోత్రాకు స్పాన్సర్ చేసి పాక్ ట్రావెల్ సంస్థ
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
ఇది చేసిన పనిని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం మెచ్చుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ వీడియోలో.. ఓ కుక్క ట్రాఫిక్ నియమాన్ని తనకు ఇంతకు ముందు తెలిసినట్టుగానే పాటించింది. సిగ్నల్‌ను పడిన వెంటనే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఆ మూగ జీవి జీబ్రా క్రాసింగ్ పై నుంచి రోడ్డు క్రాస్ చేసింది. మళ్లీ రోడ్డు అవతలి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ.. సిగ్నల్ పడి వాహనాలు నిలిచే వరకు వేచి ఉంది. సిగ్నల్ పడిన వెంటనే వాహనాలు నిలిచిపోవడంతో ఆ శునకం మళ్లీ జీబ్రా క్రాసింగ్ మీద నుంచి రోడ్డు దాటింది. ఇలా మూడు సార్లు ట్రాఫిక్ నియమాన్ని పాటిస్తూ.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మన్ననలు పొందింది. ఈ వీడియోను షేర్ చేసిన ట్రాఫిక్ పోలీసులు.. “కొన్నిసార్లు, అతి చిన్న జీవులు మనకు అతిపెద్ద పాఠాలను నేర్పుతాయి.” అని రాసుకొచ్చారు. ఈ కుక్క చేసిన పనికి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలో మూగ జంతువుకు తెలిస్తే.. మనుషులకు ఎందుకు అర్థం కావడం లేదంటూ చాలా మంది కామెంట్ చేశారు.
READ MORE: Cuteness Overload: పార్లమెంట్‌లో బాలనేతలు భలే బాగున్నారుగా..!
#HYDTPweBringAwareness
Sometimes, the smallest creatures give us the biggest lessons. 🐕 #RespectRules #DriveSafe #ObeyTheRules #RoadDiscipline #PedistrainWay #RoadSafety pic.twitter.com/3xN2gm4SCq— Hyderabad Traffic Police (@HYDTP) May 20, 2025
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి