పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. ప్రశాంత్ దర్శకత్వం వహించిన KGF 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. “సలార్” కూడా ఆయన దర్శకత్వంలోనే వస్తుండడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. “సలార్” టీజర్‌ను మేలో మేకర్స్ విడుదల చేయనున్నారనే టాక్ నడుస్తోంది. ఇక తాజాగా “సలార్” సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Read Also : Shivani Rajasekhar : మిస్ ఇండియా రేసులో రాజశేఖర్ తనయ
మంగళవారం “సలార్” చిత్రం సెట్స్ నుండి రెండు ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో ప్రభాస్ అభిమానులు వాటిని షేర్ చేస్తున్నారు. దీంతో “సలార్ ట్విట్టర్ ట్రెండింగ్ లో ట్రెండ్ అవుతోంది. లీక్ అయిన ఫోటోలలో ఒకదానిలో ప్రభాస్ ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం సిద్ధంగా ఉన్నాడు. టీం ఆయనను టేక్ కోసం సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. మరొకదానిలో ప్రభాస్ తన చుట్టూ ఉన్న కొంతమంది స్పాట్ బాయ్స్‌తో సినిమా సెట్‌పై సాధారణంగా నడుస్తూ కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫోటోలు లీక్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాగే జరిగింది. మేకర్స్ సెట్స్ నుంచి ఇలా ఫోటోలు లీక్ అవ్వకుండా జాగ్రత్త పడాలంటూ ప్రభాస్ అభిమానులు కోరుతున్నారు.
https://twitter.com/Suhailk78792/status/1516281692331610112?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1516281692331610112%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.dnaindia.com%2Fentertainment%2Freport-prabhas-starrer-salaar-trends-on-twitter-as-photos-from-film-s-set-leak-online-2947085