పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. ప్రశాంత్ దర్శకత్వం వహించిన KGF 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. “సలార్” కూడా ఆయన దర్శకత్వంలోనే వస్తుండడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. “సలార్” టీజర్‌ను మేలో మేకర్స్ విడుదల చేయనున్నారనే టాక్ నడుస్తోంది. ఇక తాజాగా “సలార్” సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అవి ఇప్పుడు…