రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ ని కామెంట్స్ చేసిన వాళ్లు, ఆ బాక్సాఫీస్ కటౌట్ పై డౌట్స్ పెట్టుకున్న వాళ్లు సైలెంట్ అయ్యే రోజు వచ్చేస్తోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా, ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా ‘డార్క్ సెంట్రిక్ థీమ్’ వాడుతూ తెరకెక్కిన సినిమా సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్నన్ని అంచనాలు మరే సినిమాపై లేవు. జూలై 6న రిలీజైన సలార్ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యుట్యూబ్ ని కుదిపేసిన సలార్ టీజర్, అప్పటివరకూ ఉన్న రికార్డులు చెల్లా చెదురు చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. టీజర్ కే ఇలా అయిపోతే ఎలా సలార్ ట్రైలర్ వస్తుంది వెయిట్ చేయండి, మాస్ హిస్టీరియా అనే పదానికి అర్ధం చూపిస్తాం అంటూ మేకర్స్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఆగష్టులో ట్రైలర్ రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఫస్ట్ సాంగ్ బయటకి రానుంది. సలార్ ట్రైలర్ కన్నా ముందు సాంగ్ బయటకి రానుంది. KGF సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత బాగుంటుందో సాంగ్స్ కూడా అదే రేంజులో ఉంటాయి. తుఫాన్ సాంగ్ కైతే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ ఆ రేంజ్ సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పుడు సలార్ విషయంలో అది రిపీట్ అవుతుందో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాలి. మేకర్స్ ఫస్ట్ సాంగ్ ని రెడీ చేసారట, ప్రశాంత్ నీల్ వైఫ్ సలార్ మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో వైరల్ అవ్వడంతో సలార్ టాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. మరి సలార్ సాంగ్స్ KGFని మించి ఉంటాయా లేదా అనేది చూడాలి.