Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా ఆమె చేస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ మూవీ ప్రమోషన్లలో ఆమె వర్కింగ్ అవర్రస్ పై స్పందించింది. ‘నేను కూడా ఎక్కువ గంటలు పనిచేయడానికి ఇష్టపడను. కానీ ప్రస్తుతం చాలా గంటలు పనిచేస్తూనే ఉంటున్నా. కంటినిండా నిద్రపోయి చాలా కాలం అవుతోంది. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోలేకపోతున్నా. కానీ మీరు నాలాగా చేయొద్దు. ఒక షెడ్యూల్ ప్రకారం పనిచేయండి. ఒక టైమ్ పెట్టుకోండి. రోజుకు 8 నుంచి 9 గంటలు పడుకోండి.
Read Also : Movie Tickets Rates : తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఛాన్స్..?
లైఫ్ లో కచ్చితంగా షెడ్యూల్ పెట్టుకుని పనిచేయాలి. అలా చేయడం వల్ల మన ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ దొరుకుతుంది. అలా చేయడం మంచి వాతావరణం క్రియేట్ చేస్తుంది. నేను కూడా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నా. రేపు నేను తల్లిని అయ్యాక కూడా అలాంటి షెడ్యూల్ ను కోరుకుంటాను అని తెలిపింది రష్మిక. దీపిక పదుకొణె 8గంటల పని అనే కండీషన్ తోనే కల్కి-2, స్పిరిట్ సినిమాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే కదా. మరి ఇప్పుడు రష్మిక కూడా అలాంటి కండీషన్లు పెడుతుందా.. లేదంటే సినిమాల కోసం టైమ్ కేటాయిస్తుందా చూడాలి.
Read Also : Samantha : సమంత సినిమాలో విలన్ గా క్రేజీ యాక్టర్..