అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారిపోయాడు రాహుల్ రామకృష్ణ. ఈ సినిమా తరువాత రాహుల్ వెనుతిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న రాహుల్ సడెన్ గా ఈ రోజు ఉదయం సినిమాలు నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. “2022 నా చివరిది.. ఇకపై సినిమాలు చేయను” అని ట్వీట్ చేశాడు. దీంతో రాహుల్ కి ఏమైంది.. ఎందుకు సినిమాలను ఆపేస్తున్నాడు అంటూ నెటిజన్స్, అభిమానులు ఆయనకు ట్వీట్ల మీద ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. ఇక దీంతో ఈ సాయంత్రానికి ఈ ట్వీట్ పై రాహుల్ క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ పోస్ట్ చేశారు.
“సినిమాలు చేయనని జోక్ చేశాను.. ఫూల్స్ .. భారీ రెమ్యునరేషన్, విలాసమైన జీవితం, ఎన్నో ప్రయోజనాలను ఎందుకు వదులుకుంటాను. నేను రిటైర్మెంట్ చెప్పానని నన్ను అభినందించడానికి నా స్నేహితులు ఫోన్ చేయడంఆశ్చర్యం.. నమ్మలేకపోతున్నా” అంటూ ట్వీట్ చేశాడు. ఇక దీంతో రాహుల్ జోక్ చేశాడు.. నిఓజంగా సినిమాలు మానడం లేదని తెలుస్తోంది. అయిపోతే ఈ జోక్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో జోక్ ఏంటి..? అయినా మమ్మల్ని ఫూల్ చేయడానికి మేము ఎలా కనిపిస్తున్నాం.. మీ సినిమాలతో ఫూల్స్ చేయడమే కాదు ఇలాంటి ట్వీట్స్ తో కూడా ఫూల్స్ చేస్తున్నావా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.