శివరాత్రి వేడుకల్లో ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వేదిక పంచుకోవడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతల నుంచి డీకే.శివకుమార్‌పై తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది.
ఉదయం ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. 25 ఏళ్ల జీవితంలో ఎవరిపై చేయి చేసుకోలేదని ఈటల అన్నారు. కానీ ఈ రోజు న్యాయం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
రేషన్ కార్డుల జారీపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు.
తెలంగాణలో బీర్ల సరఫరా నిలిపివేతపై యూబీఎల్ (United Breweries Limited) వివరణ ఇచ్చింది. 2019 నుంచి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ధరలు పెంచలేదని తెలిపింది. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తూ బీర్లు సరఫరా చేశాం.. ధరలు సవరించాలని టీజీబీసీఎల్‌ను అనేక సార్లు కోరామన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇలా ఇప్పటివరకూ 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, మరి కొందరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకొందరు కూడా పార్టీ మారుతారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్‌కు బైబై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మార్పు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తామని అనలేదని.. శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు జరగలేదని మాత్రమే అన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో విజయ సంకల్ప యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పదేళ్లుగా మోసం చేసిందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఇక బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మాదిరిగా చీకటి రాజకీయాలు మేం చేయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని కిషన్ రెడ్డి…
దేశ వ్యాప్తంగా సీబీఎస్‌ఈ (CBSE Board) బోర్డు 10, 12 తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షల ప్రారంభానికి ముందే దేశ రాజధాని ఢిల్లీకి అన్నదాతలు కదంతొక్కారు. పెద్ద ఎత్తున రైతులు హస్తినకు తరలివచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రైతుల ఆందోళన నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలు రద్దు అయ్యాయంటూ ఓ సర్క్యులర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో CBSE బోర్డు స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోన్న నకిలీ లేఖను…
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైసీపీకి నేతలు మారుతున్నారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే ఉన్నానని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. ఇది తనపై జరుగుతున్న దుష్ప్రచారమని తెలిపారు.