R Narayana Murthy: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో ఉన్న సమస్యలను ఆయన చిత్రాల ద్వారా ఎండగడుతూ ఉంటారు. ప్రభుత్వాల వలన, దళారుల వలన రైతులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఆయన సినిమాలు ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. అంతేకాకుండా మంచి చిత్రాలను ప్రశంసించడంలో పీపుల్స్ స్టార్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన ధనుష్ నటించిన సార్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ వేదికపై ఆయన సినిమా గురించి చిత్ర బృందం గురించి చెప్పుకొచ్చారు. “ముందుగా ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని, ఒక గొప్ప చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గుండెలకు హత్తుకునేలా సినిమా ఉంటే సూపర్ హిట్ చేస్తామని మరోసారి ప్రేక్షకులు నిరూపించారు. ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడికి నా అభినందనలు. ఇలాంటి సినిమాలు తీయడం ఆశామాషి కాదు. దానికి గుండె ధైర్యం కావాలి. ఇది ఆర్ట్ ఫిల్మ్ కాదు.. కానీ ఆర్ట్ ఫిల్మే. ఇది కమర్షియల్ సినిమా కాదు.. కానీ కమర్షియల్ సినిమానే. అలా మాయ చేశాడు దర్శకుడు. ఇది ప్రజల సినిమా, స్టూడెంట్స్ సినిమా, పేరెంట్స్ సినిమా. జీవితంలో గుర్తుండిపోయే ఇలాంటి సినిమా తీసి హిట్ కొట్టిన నిర్మాతకు నా అభినందనలు” అని చెప్పుకొచ్చారు.
Janhvi Kapoor: నేనింకా నీకోసం వెతుకుతూనే ఉన్నా అమ్మా..
ఇక ధనుష్ గురించి మాట్లాడుతూ “ధనుష్ గారు గొప్ప నటుడు. సహజంగా నటిస్తారు. భాషతో సంబంధం లేకుండా అందరికీ దగ్గరైన నటుడు. ఆయన నటనకు సెల్యూట్” అంటూ చెప్పుకొచ్చారు. అయితే చివర్లో హైపర్ ఆది గురించి చెప్పడం మర్చిపోవడంతో మరోసారి మైక్ అందుకున్నారు. అంతలోనే ఈ ఈవెంట్ కు యాంకరింగ్ చేస్తున్న స్రవంతి.. మరొక గెస్ట్ ను మాట్లాడడానికి పిలవడంతో ఆర్ నారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ” ఏయ్ పిల్లా.. ఆగు.. ఏయ్ పిల్లా.. టైరో.. టైరో.. స్టేజి మీద ఎవరు మాట్లాడుతున్నారు.. కొంచెం చూసుకో.. కాసేపు ఆగండి. ఆ తరువాత పిలవండి.. ముందు ఆ సభ్యత నేర్చుకోండి” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.