Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరాలు మారినా.. తారలు మారినా.. ఆమె అందం, ఆమె అభినయం ఎప్పటికీ సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచే ఉంటాయి. ఐదేళ్ల క్రితం ఫిబ్రవరి 24న ఆమె దుబాయ్ లో బంధువుల పెళ్ళికి వెళ్లి.. అక్కడి హోటల్ రూమ్ బాత్ టబ్ లో గుండెపోటుతో మృతి చెందింది. ఆమె మృతి చెంది ఐదేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమె లేదన్న విషయం జీర్ణించుకోవడం చాలా కష్టం. ఇక తల్లి శ్రీదేవి నట వారసత్వాన్ని, అందాన్ని పుణికి పుచ్చుకొని బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కూతురు జాన్వీ కపూర్. కూతురును నటిగా చూడాలని శ్రీదేవి ఎంతో ఆశపడింది. ఆమె ఆశ తీరకుండానే శ్రీదేవి కన్నుమూసింది. ఇక తల్లి లేని లోటును కపూర్ గాళ్స్ జీర్ణించుకోలిపోయినా.. తండ్రి బోనీ కపూర్ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
Kangana Ranaut: బాలీవుడ్ మాఫియా.. వారికి అవార్డులు ఏంటీ..?
ఇక తాజాగా తల్లిని తలుచుకొని జాన్వీ ఎమోషనల్ అయ్యింది. ” నేను ఇప్పటికీ మీ కోసం ప్రతిచోటా వెతుకుతున్నాను అమ్మా, ఇప్పటికీ నేను చేసే ప్రతి పనిని నువ్వు గర్వించేలానే చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా, మరియు నేను చేసే ప్రతి పని- అది మీతో మొదలవుతుంది మీతోనే ముగుస్తుంది” అంటూ చెప్పుకొస్తూ తల్లితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం జాన్వీ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఎన్టీఆర్ 30 తో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుంది. ఇప్పటికే ఆమె ఫోటోషూట్ యూదా పూర్తి అయ్యిందని టాక్. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతోమంది వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరి తల్లిలానే ఆమె కూడా టాలీవుడ్ లో పాతుకుపోతుందో.. అందరి బాలీవుడ్ హీరోయిన్స్ లా మొదటి సినిమాతోనే పారిపోతుందో చూడాలి.