డిసెంబర్ 22న ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ క్లాష్ కి రంగం సిద్ధమయ్యింది. ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య క్లాష్ ఆఫ్ టైటాన్స్ అనిపించే రేంజ్ వార్ జరగనుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేసి ఆడియన్స్ ముందుకి వస్తుంటే… షారుఖ్ ఖాన్-రాజ్ కుమార్ హిరాణీతో కలిసి డుంకీ సినిమాతో వస్తున్నాడు. సెప్టెంబర్ 28నే రిలీజ్ అవ్వాల్సిన సలార్ సినిమా వాయిదా పడి డిసెంబర్ 22కి షిఫ్ట్ అయ్యింది. ఇదే రోజున షారుఖ్ ఖాన్ డుంకీ సినిమా రిలీజ్ అవ్వనుంది. డుంకీ రిలీజ్ డేట్ చాలా రోజుల ముందే లాక్ అయ్యింది అందుకే బాలీవుడ్ నుంచి ఎలాంటి మూవీ డిసెంబర్ 22 రేస్ లోకి రాలేదు. ప్రభాస్ మాత్రం కింగ్ ఖాన్ కి షాక్ ఇస్తూ… డైనోసర్ లా నిలబడ్డాడు.
సలార్ డిసెంబర్ 22న వస్తుంది… 21 నుంచే ఓవర్సీస్ ప్రీమియర్స్ పడుతున్నాయి అనే వార్త బయటకి రాగానే ప్రభాస్ ఒక్కసారిగా జోష్ లోకి వచ్చారు. వాళ్లని వీళ్లని క్లాష్ లో బీట్ చేస్తే మజా ఏముంటుంది? డైరెక్ట్ గా ఒకే ఏడాదిలో రెండు సార్లు వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన షారుఖ్ ఖాన్ నే బీట్ చేస్తే కదా అసలు మజా ఉంటుంది అనే ఫీలింగ్ లో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే నార్త్ నుంచు ట్రోలింగ్ వచ్చినా సాలిడ్ గా కౌంటర్లు వేస్తూ డిసెంబర్ 22న చూసుకుందాం అంటున్నారు. ఈ క్లాష్ కి సంబంధించిన గొడవ సోషల్ మీడియాలో రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. లేటెస్ట్ గా ప్రభాస్ ఫ్యాన్స్… #Donkey అనే హాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ఇండియా వైడ్ ట్రెండ్ చేసారు. #Dunki ప్లేస్ లో #Donkey ట్యాగ్ ని ట్రెండ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేసారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రెండు సినిమాల ప్రమోషన్స్ స్టార్ట్ అయినప్పుడు ఫ్యాన్ వార్ ఇంకెలా ఉంటుందో చూడాలి.