టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబులకు ఎంత క్రేజ్, మార్కెట్, ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ హీరోలతో కలిపి పని చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ నుంచి స్టార్ హీరోయిన్ల దాకా.. క్యూలో నిల్చొంటారు. అలాంటి ఆ ఇద్దరు హీరోలకు.. పూజా హెగ్డే హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా విజయ్ దేవరకొండ కోసం ఈ అమ్మడు ఆ పని చేసింది.
కొన్ని రోజుల నుంచి తానో యాక్షన్ సినిమాలో చేస్తున్నానని పూజా ప్రతీ ఇంటర్వ్యూలోనూ చెప్తూ వచ్చింది కానీ, ఆ సినిమా ఏంటన్నది రివీల్ చేయలేదు. ఇప్పుడు ఇన్నిరోజుల తర్వాత అది విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో రూపొందుతోన్న ‘జన గణ మన’ అని తేలింది. ఈరోజే (04-06-22) ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వగా, పూజా హెగ్డే షూట్‌లో జాయిన్ అయ్యింది. అయితే, ఈ సినిమాని ఒప్పుకోవడానికి ముందే పూజా హెగ్డే పవన్, మహేశ్ సినిమాల్ని ఒప్పుకుంది. అవే.. భవదీయుడు భగత్ సింగ్, SSMB28. ఇప్పుడు అనూహ్యంగా ఈ రెండు ప్రాజెక్టులకి పంగనామాలు పెట్టేసి, విజయ్‌తో రొమాన్స్ చేయడానికి ఈ అమ్మడు సిద్ధమైపోయింది.
పవన్ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. మహేశ్ బాబు సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనా, షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దీనికితోడు.. ‘జన గణ మన’ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. అందుకేనేమో.. పూజా హెగ్డే ఈ సినిమాకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. పైగా, ఇందులో ఈ అమ్మడు యాక్షన్ కూడా చేయనుందని సమాచారం. ఈ విషయాన్ని పూజానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఇదిలావుండగా.. మహేశ్, త్రివిక్రమ్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ప్రియాంకా అరుళ్ మోహన్‌ని తీసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. అయితే, దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.