NBK109: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ల మీద నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. NBK109 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యకు ధీటుగా బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం కోసం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ ను రంగంలోకి దింపాడు బాబీ. ఈ సినిమాలో దుల్కర్.. ఒక కీలక పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఒక కీలక షెడ్యూల్ ను బాలయ్య, దుల్కర్ మీద పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దుల్కర్.. నటుడిగా ఎదుగుతున్నాడు. ఒక పక్క హీరోగా నటిస్తూనే .. ఇంకోపక్క సపోర్టింగ్ రోల్స్ తో కూడా మెప్పిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఇక నిజం చెప్పాలంటే.. అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే బాబీ.. చిరుతో వాల్తేరు వీరయ్య లాంటి హిట్ ను అందించాడు. అలాంటి మాస్ సినిమా తరువాత బాలయ్యతో NBK109 మొదలుపెట్టాడు. ఇక ఇది ఊరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్‌లో రూపొందుతున్నట్టు స్పష్టమవుతోంది. అంతేకాకుండా స్టార్ క్యాస్టింగ్ ను దింపడంతో మరింత హైప్ పెంచేస్తుంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారట మేకర్స్. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.