కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం “క”. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్నాడు. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ హీరో. రొటీన్ కథలకు స్వస్తి చెప్పి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ నేపథ్యంలో సాగే కథాంశాన్ని ఎంచుకొని అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నేడు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు సందర్భంగా క చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఎలా ఉందొ సారి చూద్దాం రండి..?
టీజర్ ప్రారంభంలో టైమ్ ట్రావెల్ లాంటి వస్తువును చూపించి కృష్ణగిరి అనే మారుమూల పల్లెటూరులో పోస్ట్ మ్యాన్ గా పని చేస్తూ ఆ ఊరి ప్రజలకు వచ్చే ఉత్తరాలను చదువుతు తిరిగే కుర్రాడు ఆ తర్వాత హత్యలు చేసేవరకు వెళ్లినట్టు చూపించారు. మీకు తెలిసి నేను మంచి కానీ నేను.. అంటూ గోడపై sr. ఎన్టీఆర్ రావణాసురుడి చిత్రాన్ని చూపిస్తూ తోడేలువురా నువ్వు అంటూ విలన్ చెప్పేటు వంటి షాట్స్ ఆకట్టుకున్నాయి. చివరలో ఆంజనేయస్వామి, ఎద్దులబండి,ఉత్తరాలు, అమ్మవారి జాతర వీటన్నిటికి లింక్ ఏంటనే సస్పెన్స్ తో సైకిల్ హ్యాండిల్ తో ఫైట్ చేసిన హీరోపై టీజర్ ను ముగించారు.
కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథ, రాయలసీమ యాక్షన్ నేపధ్యాన్ని ఎంచుకున్నాడు. టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా, ట్విస్ట్ లతో ఆకట్టుకుంది. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా కుదిరింది. దర్శక స్వయం సందీప్ – సుజిత్ ల షాట్ మేకింగ్ లో ప్రతిభ కనిపిస్తుంది. ఈ చిత్రంతో హిట్ కొట్టేలా ఉన్నాడు ఈ యంగ్ హీరో. పనిలో పనిగా టీజర్ ఫై మీరు ఒక లుక్ వేయండి..
Also Read: Mega star : విశ్వంభరుని సంగీత కచేరి పనులు ప్రారంభం…