మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. మెగాస్టార్ కు జోడిగా స్టార్ హీరోయిన్ త్రిష, ఆషిక రంగనాధ్ నటిస్తున్నారు. బింబిసార వంటి సూపర్ హిట్ చిత్రాన్నీ డైరెక్ట్ చేసిన వశిష్ఠ విశ్వంభరకు దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తయారవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ఇటీవల ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ.
విస్వంభర చిత్రానికి MM. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ను బెంగుళూరులో ప్రారంభించినట్టు పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. దర్శకుడు వశిష్ఠ, సంగీత దర్శకుడితో పాటు హీరో చిరంజీవి మరియు ఇతర సాంకేతిక వర్గం కూడా ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి పాత సినిమాలకు చెందిన కొన్ని పాటలతో కీరవాణి తన టీంతో సంగీత కచేరి నిర్వహించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు డబ్బింగ్ పనులు, మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ తోపాటు బ్యాలెన్స్ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ప్రకటన ఉండనుందని సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా కనిపించనున్నట్టు యూనిట్ నుండి సమాచారం తెలిసింది. ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటించబోతున్నారు.
2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్న విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేర్ వీరయ్య తరహాలో విశ్వంభర సూపర్ హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read : Akshay kumar: సమోసా తింటావా..అయితే నా సినిమాకు రా..ఇంతకి ఏమిటా సంగతి..?