Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఒక ఏడాదిలో మహేష్.. ఫ్యామిలీతో వెళ్లే వెకేషన్స్ లెక్కబెట్టలేం అని చెప్పొచ్చు. ఈవెంట్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, నమ్రత లేకుండా బయట కనిపించడు. అయితే చాలా రేర్ గా మహేష్ సోలో ట్రిప్స్ వేస్తాడు. ఇప్పుడు కూడా అలాంటి సోలో ట్రిప్ ఒకటి మహేష్ వేశాడు. కొద్దిసేపటి క్రితమే మహేష్.. జర్మనీ ఫ్లైట్ ఎక్కాడు. ఇక ఈ సోలో ట్రిప్ పై సోషల్ మీడియాలో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ట్రిప్ వెనుక రాజమౌళి హస్తం ఉందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది మహేష్ గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కూడా మంచి కలక్షన్స్ రాబడుతుంది. గుంటూరు కారంలో మహేష్ నటన, డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
ఇక ఈ సినిమా తరువాత మహేష్ , రాజమౌళి దర్శకత్వంలో SSMB29 సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఎలాగూ గుంటూరు కారం రిలీజ్ కూడా అయిపోవడంతో.. మహేష్ ను పూర్తిగా జక్కన్న లాగేసుకున్నాడు. తన సినిమా కోసం వీరిద్దరూ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పని కోసమే మహేష్.. సోలో ట్రిప్ వేసాడని టాక్ నడుస్తోంది. SSMB29 కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను, కొత్త టెక్నాలిజీని వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇక జర్మనీలో వారిని కలవడానికి, కొంతవరకు మహేష్ గ్రౌండ్ వర్క్ చేయనున్నట్లు సమాచారం. మూడురోజుల పాటు మహేష్ జర్మనీలో ఉండబోతున్నాడట. అనంతరం.. ఇండియాకు వచ్చి గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.