Jyothi Raj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చెప్పిన విధంగానే ఉల్టా ఫుల్టా లా సాగుతోంది. ఎలిమినేషన్ అయినవాళ్లకు మళ్లీ వస్తున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీలు.. సీక్రెట్ ఎంట్రీలు.. ఇలా ఈ సీజన్ అంతా చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు వాళ్లలో వాళ్ళు కొట్టుకున్న కంటెస్టెంట్స్.. గతవారం కొత్తవాళ్లు రావడంతో వాళ్ళతో గొడవకు దిగుతున్నారు. ఇక మొదటి వారమే టాస్క్ లో గెలిచి.. 5 వారాలు నామినేషన్ దరిదాపుల్లోకి రాకుండా సేఫ్ గా ఉన్నాడు డ్యాన్స్ మాస్టర్ సందీప్. ఇక 5 వారాల తరువాత సందీప్ ఆట మొదలయ్యింది. కొన్నిసార్లు.. బయాస్ గా ఆడుతూ.. అమర్, శోభా, ప్రియాంక లకు సపోర్ట్ గా ఉంటున్నట్లు కనిపించాడు. గేమ్ లో చీట్ చేస్తూ దొరికిపోయాడు. ప్రతి వారం నాగార్జునతో తిట్లు తింటూనే ఉన్నాడు. ఇక గతవారం.. సందీప్ పై నాగ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. తొక్కలో సంచలాక్ అని, నువ్వేమైనా పిస్తావా అని అంటూ కోపం చూపించాడు. అయితే.. తన భర్తను అలా అనడం తనకు నచ్చలేదని.. నాగార్జునకు ఆ స్థాయి ఉంటే.. ఏదైనా అంటాడా.. అని సందీప్ భార్య జ్యోతి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేయడం నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. నాగార్జున.. తన భర్తను అలా తిట్టడం తనకు నచ్చలేదని చెప్పుకొచ్చింది.
Nani: నాన్న లిప్ లాక్.. ఇంట్లో గొడవ తప్పదా.. ?
” నా భర్త గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఎంతో నిజాయితీగా ఆడుతున్నాడు. నాగార్జున అలా సడెన్ గా అనేశారేంటి..? అని అనుకున్నాను. ఎవరైనా సరే నా భర్తను ఒక మాట అంటే నేను తట్టుకోలేను. నాగార్జున అయినా.. మోదీ అయినా.. నాకు నా భర్తనే గొప్ప. నాగార్జునకు ఆ స్థాయి ఉంటే.. ఏదైనా అంటాడా.. అది గేమ్ షో కాబట్టి నేనేం అనలేకపోయాను. సందీప్ కు అస్సలు కోపం రాదు. కానీ, వస్తే అస్సలు ఆగడు. హౌస్ లో సందీప్ ను చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారు. ఆటను ఆడడానికి మాత్రమే సందీప్ హౌస్ కు వెళ్ళాడు. సందీప్ గ్రేట్ అని అన్న నాగార్జుననే.. నువ్వేమైనా పిస్తావా అని అన్నాడు. అవన్నీ గేమ్ లో మాటలే కదా అని సర్దిపెట్టుకున్నాను. అయినా బిగ్ బాస్ నుంచి కొత్తగా సందీప్ రావాల్సిన పేరు ఏం లేదు. తనకు ఆల్రెడీ బయట పేరు ఉంది” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలు విన్న అభిమానులు భర్తను బాగానే వెనకేసుకొస్తుంది అని చెప్పుకొస్తున్నారు. మరి సందీప్.. బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఉంటాడా.. ? లేదా అనేది తెలియాలి.