Nani: నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యువ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మృణాల్, నాని మధ్య లిప్ లాక్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాని ఈ లిప్ లాక్ ల మీద స్పందించాడు. నాని గారు.. ఇప్పటివరకూ ఫాదర్ క్యారెక్టర్ ని చేసే హీరోలు ఒక వయసు దాటిన తర్వాత చేశారు. మీరు ఇంకా యంగ్ గానే వున్నారు. ఈ వయసులో చేయడం ఎలా అనిపిస్తుంది ? అన్నప్రశ్నకు
“రోజులు మారాయి. పద్దతులు కూడా మారాలని భావిస్తాను. ప్రేక్షకులు చాలా ఫాస్ట్ గా అప్డేట్ అవుతున్నారు. వాళ్ళని అందుకోలేకపోతే చాలా కష్టం” అని చెప్పుకొచ్చాడు.
Abhiram Daggubati: రానా నన్నెప్పుడు తమ్ముడిలా చూడలేదు.. నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు అన్న మాటలు..
ఇక లిప్ లాక్ లు ఇంట్లో చూస్తే గొడవలు తప్పవా అని అడిగిన ప్రశ్నకు.. “ఏమో ఇప్పుడే రిలీజ్ చేశాం. ఇంట్లో ఎలా ఉంటుందో చూడాలి.. నా ప్రతి సినిమాలోనూ లిప్‌లాక్ సీన్స్ లేవు. అంటే సుందరానికీ.. మూవీతో పాటు దసరా సినిమాలో కూడా ముద్దు సన్నివేశాలు లేవు. కొన్ని సినిమాల్లో మాత్రం ఆ తరహా సీన్స్ ఉన్నాయి. అలాంటి సీన్స్‌లో నటించినప్పుడు మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతుంటాయి. అయితే నేను ఒక నటుడిని. కథ డిమాండ్ మేరకే అలాంటి సీన్స్‌లో నటిస్తాను” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.