Johnny Depp: హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతడు పరువు నష్టం కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో కూడా ఎవరికి చెప్పనవసరం లేదు. 2018 డిసెంబర్ లో అమెరికాలోని ఫెయిర్ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో తన మాజీ భార్యపై జానీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అతను డ్రగ్స్, ఆల్కహాల్ ప్రభావానికి గురైన సమయంలో తనను శారీరకంగా వేధించినట్టు వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో అంబర్ హర్డ్ రాసుకొచ్చింది. దానిని ఖండిస్తూ జానీ కోర్టులో కేసు వేశాడు. అవన్నీ ఆమె ఆరోపణలను మాత్రమే అని, ఇలాంటి ఆరోపణలు చేసి తన పరువును పోగొట్టినందుకు కాను ఆమె తనకు 50 మిలియన్ డాలర్లు పరువు నష్టం కింద చెల్లించాలని కోరాడు. వాదోపవాదనలు విన్న కోర్టు జానీకు 15 మిలియన్ డాలర్లు చెల్లించాలని హెర్డ్ ను ఆదేశించగా, హెర్డ్ కు 2 మిలియన్ డాలర్లు (రూ. 8 కోట్లు) చెల్లించాలని జానీకి ఆదేశాలను జారీ చేసింది.
Sai Dharam Tej: రిషబ్ గురించి తేజ్ ట్వీట్.. ఏదిఏమైనా నీ మనసు వెన్న బ్రో
ఇక మాజీ భార్య ఇచ్చిన డబ్బును జానీ.. ఛారిటీలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు 2 మిలియన్ డాలర్లు వరకు ఛారిటీలకు ఇవ్వాలని నిర్ణయించుకున్న జానీ.. ఐదు ఛారిటీ ట్రస్టులను ఎంచుకున్నాడు. మేక్ ఏ ఫిల్మ్ ఫౌండేషన్, ద పెయింటెడ్ టర్టిల్, రెడ్ ఫెదర్, మార్లన్ బ్రాండోస్ కు చెందిన టెటిరో సొసైటీ చారిటీ, అమెజానియా ఫండ్ అలియన్స్ అనే ట్రస్టులను ఎంచుకున్న అతను.. ఒక్కో ట్రస్ట్ కు 2 లక్షల డాలర్లను ఇవ్వనున్నాడు. ఇందులో ఉన్నవారందరూ ప్రాణాలతో పోరాడుతున్న దర్శకులు, నిర్మాతలు.. వారి పిల్లలు ఉండడం గమనార్హం. ఇక ఈ విషయం తెలియడంతో నెటిజన్లు జానీ డెప్ ను ప్రశంసిస్తున్నారు. మంచి పని చేస్తున్నావ్ అని కొందరు అంటుండగా.. భార్యపై రివెంజ్ అంటే.. ఆ మాత్రం ఉండాలి మావా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.