Marvel Movies: జేమ్స్ కేమరాన్ ‘అవతార్’ సినిమా తదుపరి భాగాలు చూడాలని అభిమానులు తెగ ఆరాట పడుతున్నారు. అయితే ‘అవతార్’ సిరీస్ కు అవరోధాలు ఎదురవుతున్నాయట. ‘అవతార్’తో పాటు మార్వెల్ మూవీస్ కూ ఈ ఆటంకం తప్పటం లేదు. ఎందుకో చూద్దాం.. ‘అవతార్’ మొదటి భాగం అలరించిన స్థాయిలో ‘అవతార్’ రెండో భాగం ‘ద వే ఆఫ్ వాటర్’ ఆకట్టుకోలేకపోయింది. కానీ మొత్తం మీద వసూళ్ళలో మాత్రం మూడో స్థానంలో నిలిచింది. దాంతో అవతార్ అభిమానులలో తరువాత రాబోయే సిరీస్ చూడాలన్న ఆసక్తి పెరిగింది. నిజానికి ‘అవతార్’ మూడో భాగాన్ని 2025 డిసెంబర్ 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఆ తదుపరి రెండు భాగాలు 2029, 2031లో రావలసి ఉంది. అయితే అనుకున్న ప్రకారం ఈ సినిమాలు వస్తాయా? లేదా? అన్న ఆందోళన అభిమానుల్లో ఏర్పడుతోంది.
ఎందుకంటే హాలీవుడ్ లో నలభై రోజులుగా ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ సమ్మె చేస్తోంది. దాంతో సినిమాల నిర్మాణం ఆగిపోయింది. భారీ చిత్రాల రూపకల్పనలో ఒక్క రోజు మిస్ అయినా, ఎంతో నష్టం వాటిల్లుతుంది. అలాంటిది నలభై రోజుల నుంచీ ఆటంకం కలగడం వల్ల నష్టం కూడా భారీగానే ఉంటుందని అంచనా!
Sai Dharam Tej: రిషబ్ గురించి తేజ్ ట్వీట్.. ఏదిఏమైనా నీ మనసు వెన్న బ్రో
జేమ్స్ కేమరాన్ ‘అవతార్’ సిరీస్ కే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అలరించే మార్వెల్ మూవీస్ పై కూడా ఈ దెబ్బ పడింది. కేమరాన్ ముందుగానే 2031లోగా మిగిలిన ‘అవతార్’ మూడు భాగాలనూ విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ఆయన సినిమాకు అటు ఇటయినా పెద్దగా తేడా ఉండదు. కానీ, వరుసగా ప్రేక్షకులను అలరించే పని పెట్టుకున్న మార్వెల్ మూవీస్ షూటింగ్స్ కు మాత్రం ఈ అంతరాయం వల్ల భారీ నష్టమే వాటిల్లనుంది. ‘అవతార్, మార్వెల్ మూవీస్’తో పాటు టామ్ క్రూయిజ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రెకనింగ్ పార్టు 2’కు కూడా స్ట్రైక్ గండం ఎదురవుతోంది. అలాగే మరికొందరు టాప్ స్టార్స్ మూవీస్ కూడా రైటర్స్ గిల్డ్ స్టైక్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎంతోమంది నిర్మాతలు, స్టూడియో అధినేతలు తమ తాజా చిత్రాల రిలీజ్ డేట్స్ ను మార్చుకుంటున్నారు. ‘కంటెంట్ కీలకం’ అంటూ దర్శకనిర్మాతలే స్టేట్మెంట్ ఇవ్వడం కాదు – కంటెంట్ రాసే రైటర్స్ కు తగిన పారితోషికాలు ఇచ్చినప్పుడే ఈ సమ్మెకు ముగింపు పలుకుతామని రైటర్స్ అంటున్నారు. నలభై రోజులు దాటి జరుగుతున్న ఈ సమ్మె ఇంకా ఎంత కాలం సాగుతుందో, ఎన్ని సినిమాలకు సమస్యగా
మారుతుందో చూడాలి.