Dilruba : కిరణ్ అబ్బవరం ఇప్పుడిప్పుడే మంచి ఫామ్ లోకి వస్తున్నాడు. చాలా ప్లాపుల తర్వాత “క” సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇదే జోష్ లో దిల్ రుబా అనే సినిమాతో వస్తున్నాడు. ఎప్పటిలాగానే ఈ సారి కూడా ఛాలెంజ్ విసిరి మూవీ ప్రమోషన్ చేసుకుంటున్నాడు. సినిమా స్టోరీ చెబితే దిల్ రుబా బైక్ ఇచ్చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించాడు. దాంతో మూవీ గురించి ఆటోమేటిక్ గానే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ చేసిన మూవీ టీమ్.. ఇప్పుడు నాలుగో సాంగ్ కేసీపీడీని రిలీజ్ చేసేసింది. ఇందులో కాలేజీ హాస్టల్ లో జరిగే ఫైట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సాంగ్ ఉంటుంది.
Read Also: Samantha: సైలెంట్ గా స్టార్ డైరెక్టర్ తో మూవీ చేస్తున్న సమంత..
సాంగ్ లో హీరో కిరణ్ అబ్బవరం ప్రత్యర్థులను కొట్టడానికి తాళాలు తీసుకుని వెళ్తాడు. ఆ టైమ్ లో హాస్టల్ డోర్ కు “బ్రో” సినిమాలోని పవన్ కల్యాణ్ పోస్టర్ అతికించి ఉంటుంది. ఆ పోస్టర్ మధ్యలో నుంచి సేమ్ అదే డ్రెస్ లో కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇవ్వడం ఇందులో కనిపిస్తుంది. ఈ సీన్ కు కచ్చితంగా థియేటర్లలో విజిల్స్ పడుతాయని అంటున్నారు. కొందరేమో కిరణ్ అబ్బవరం పవన్ కల్యాణ్ ఇమేజ్ ను బాగానే వాడుకుంటున్నాడని చెబుతున్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం కిరణ్ ను సపోర్టు చేస్తున్నారు. ఎందుకంటే తాను పవన్ కల్యాణ్ వీరాభిమాని అని గతంలో కిరణ్ అబ్బవరం చాలా సార్లు చెప్పుకున్నాడు.
Read Also: Priya Prakash : నాకు మూవీ ఛాన్సులు ఇవ్వట్లేదు.. ఆ పని చేసుకుంటున్నా..!
ఇప్పుడు ఒక అభిమానిగానే పవన్ పోస్టర్ ను తన సినిమాలో వాడుకున్నాడని.. అందులో తప్పేముందని కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీని మార్చి 14న రిలీజ్ చేయబోతున్నారు. కిరణ్ ఈ సినిమాతో హిట్ ట్రాక్ కంటిన్యూ చేస్తాడా లేదా అన్నది చూడాలి.