మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా చుట్టూ ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. నిజానికి చెప్పాలంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ మూవీ జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా కంటెంట్ కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన విషయం హాట్ టాపిక్‌గా మారింది అదేమిటంటే.. నయనతార ప్రమోషన్స్!
Also Read: Prabhas : న్యూ ఇయర్ కానుకగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ‘కల్కి 2’ అప్డేట్.
సాధారణంగా నయనతార తన సినిమాల ప్రమోషన్లకు ఎప్పుడూ దూరంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినిమా అగ్రిమెంట్ లోనే తాను ప్రమోషన్లకు రానని ముందే నిబంధనలు పెడుతుంటారని టాక్. అలాంటి నయనతార, ఈ సినిమా విషయంలో మాత్రం రూట్ మార్చడం సినీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్వయంగా నయనతారే దర్శకుడు అనిల్ రావిపూడిని, “నేను ప్రమోషన్లలో పాల్గొంటా.. ఎక్కడ మొదలుపెడదాం?” అని అడిగినట్లు ఒక వీడియోను టీమ్ రిలీజ్ చేసింది. నయన్ లాంటి స్టార్ హీరోయిన్ను ప్రమోషన్ల బరిలోకి దింపడం ఎవరికీ సాధ్యం కాని ఫీట్ అని, అది ఒక్క అనిల్ రావిపూడికే సాధ్యమైందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నయనతార స్వయంగా రంగంలోకి దిగడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
Also Read: Dhurandhar : ‘ధురంధర్’కు సెన్సార్ షాక్.. ఆ పదం తొలగించాలంటూ కేంద్రం ఆదేశాలు!
మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్, మెగాస్టార్ గ్రేస్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన టీజర్ హింట్ ఇచ్చింది. దానికి తోడుగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలకపాత్రలో నటిస్తూ ఉండడంతో సినిమా అంచనాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు మీడియాకు దూరంగా ఉన్న నయనతార, ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం చురుగ్గా ప్రమోషన్లు చేయడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అనిల్ రావిపూడి తన మేకింగ్ స్టైల్ తోనే కాకుండా, ఇలాంటి క్రేజీ ప్రమోషన్ ప్లాన్లతో కూడా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. మరి సంక్రాంతి బరిలో ‘మన శంకర్ వరప్రసాద్’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి!