బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు, ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకుంది. ఇక చాలా కాలం తర్వాత ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సీత పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది కృతి. ఇక ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు తమిళ కథానాయకుడు ధనుష్ కి జంటగా నటిస్తున్న చిత్రం ‘తేరే ఇష్క్ మే’.
Also Read: Mohanlal : ‘L2E: ఎంపురాన్’ మరచిపోలేని జర్నీ..
‘రాంయునా’, ‘అత్రంగీ రే’ తర్వాత ధనుష్, ఆనంద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. ఇక ఈ మూవీ నుంచి ఇటీవలే విడుదలైన ఓ వీడియో సినిమాపై అంచనాలను పెంచింది. ఈ ఏడాది నవంబరు 28న హిందీ, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా చిత్రీకరణ వేగంగా పరుగులు పెట్టిస్తున్నట్లు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకున్న కృతి, ‘ప్రేమ కోసం అబ్బాయిలే ప్రాణాలర్పిస్తారా? కొంతమంది అమ్మాయిలకు కూడా ఆ ధైర్యం ఉంది’ అంటూ మూవీ డైలాగ్ తో పంచుకుంది. ప్రజంట్ ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.