మాలివుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘L2E: ఎంపురాన్’. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించిన ఈ మూవీ. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, స్టార్ యాక్టర్ అండ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కింది. ఈ చిత్రంలో టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్ కూడా ముఖ్యం పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఇక ప్రమోషన్స్‌ల్లో భాగంగా గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను ఐమ్యాక్స్ ఫార్మేట్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్‌లాల్ మాట్లాడతూ ఈ మూవీ జర్నీ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు..
Also Read: Mahesh Babu: అందరికీ ఏజ్ పెరుగుతుంటే నీకు తగ్గుతుందేంటయ్యా
‘ ‘L2E: ఎంపురాన్’..ఈ పాన్ ఇండియా సినిమాను రూపొందించటానికి, మేము ఏడేళ్ల ప్రయాణం చేశాము. ఈ జర్నీ మరచిపోలేను. ఇంత గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన పృథ్వీరాజ్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. దీన్ని సినిమా అని చెప్పడం కంటే మా చెమట, రక్తం అని చెప్పవచ్చు. ఇదొక ట్రయాలజీ మూవీ. అందులో ఇప్పటికే లూసిఫర్ సినిమా వచ్చింది. మార్చి 27న ‘L2E: ఎంపురాన్’ రానుంది. మరో సినిమాను రూపొందించాల్సి ఉంది. ఒక సముద్రం లాంటి సినిమాను రూపొందించాలని అనుకున్నాం. అది దీంతో నెరవేరింది. మనం నమ్మశక్యం కానీ గొప్ప సినిమాలను రూపొందించగలం. మలయాళ సినీ ఇండస్ట్రీ లో వస్తున్న ఈ తొలి ఐమ్యాక్స్ ఫార్మేట్ మూవీలో మ్యాజిక్ ఉంది.ఈ సినిమాను ఆడియెన్స్‌తో కలిసి చూడాలనుకుంటున్నాను’ అన్నారు.