పుష్ప సెకండ్ పార్ట్ భారీ బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడని చర్చ జరిగింది. ముందు త్రివిక్రమ్ తో సినిమా సెట్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా క్యాన్సిల్ అయింది. అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు. ఇక పాన్ ఇండియా మార్కెట్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ సెట్ చేసుకునే విధానం మీద అందరి ఫోకస్ ఉంది. ఇక ఇప్పుడు అట్లీతో సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టు సెట్ చేసింది దిల్ రాజు అని తెలుస్తోంది. నిజానికి దిల్ రాజు- అల్లు అర్జున్ గతంలో ఆర్య, పరుగు, డీజే లాంటి సినిమాలు చేశారు. అయితే వీరిద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు.
Pushpa 2 Stampede: ఆ బాలుడు ఎవరినీ గుర్తు పట్టలేడు.. మాటలు అర్థం కావు!
కానీ ఆ ప్రాజెక్ట్ ఏమిటా అనే విషయం క్లారిటీ లేదు. అయితే దిల్ రాజు దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకోకపోయినా ప్రశాంత్ నీల్ దిల్ రాజుతో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. ఇప్పుడు దిల్ రాజు తెలివిగా ఆ సినిమా అల్లు అర్జున్తో చేయమని ప్రశాంత్ నీల్ తో చెప్పడంతో దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ నేపథ్యంలోనే ఈ ప్రపోజల్తో అల్లు అర్జున్ ని కలిసి వచ్చాడు దిల్ రాజు. అయితే వీరిద్దరి కమిట్మెంట్స్ కారణంగా ఇప్పట్లో సినిమా పట్టాలు ఎక్కడ పోవచ్చు కానీ సినిమా మాత్రం పక్కా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే అట్లీతో సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తాడా లేక ప్రశాంత్ నీల్ తోనే సెట్ అవుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. మరోపక్క రామ్ చరణ్, యష్ సినిమాలు ఉన్నాయి. అలాగే ప్రభాస్ తో సలార్ 2 సినిమా చేయడానికి కూడా ప్లానింగ్ లో ఉన్నాడు.