Bhanushree Mehra Gives Clarity On Allu Arjun Block Controversy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనని ట్విటర్‌లో బ్లాక్ చేశాడంటూ నటి భానుశ్రీ మెహ్రా చేసిన ట్వీట్ పెద్ద రాద్ధాంతమే సృష్టించింది. ముఖ్యంగా.. బన్నీ ఫ్యాన్స్‌ని తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. తమ హీరోని బ్లేమ్ చేసేందుకే, బన్నీ ట్విటర్‌లో నిన్ను బ్లాక్ చేసిన వ్యవహారాన్ని తెరమీదకి తెచ్చావంటూ ఆమెపై కోపాద్రిక్తులయ్యారు. కొద్దిసేపటికే బన్నీ తనని అన్‌బ్లాక్ చేశాడని భానుశ్రీ మరో ట్వీట్ చేసినప్పటికీ.. బన్నీ అభిమానుల కోపం మాత్రం చల్లారలేదు. ఆమెపై విమర్శలు గుప్పించడం కొనసాగించారు. దీంతో.. ఆ అమ్మడు తన ఉద్దేశం బన్నీని బ్లేమ్ చేయడం కాదని మరో ట్వీట్‌లో పెగ్గేస్తూ వివరణ ఇచ్చింది. అసలు ఈ వ్యవహారం ఎలా మొదలైందంటే..
Salman Khan: సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. అదే లక్ష్యమంటూ ఈ-మెయిల్
తొలుత తన జీవితంలోని సమస్యల గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ.. బన్నీ తనని బ్లాక్ చేసిన విషయాన్ని భానుశ్రీ ప్రస్తావించింది. ‘‘సమస్యల్లో చిక్కుకుని కెరీర్‌ని ముందుకు సాగించడం మీరు భావిస్తే, నేను అంతకంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాను. అల్లు అర్జున్‌లాంటి స్టార్ హీరో సరసన ‘వరుడు’ సినిమాలో నటించినప్పటికీ.. నాకు అవకాశాలు రాలేదు. ఆ కష్టాల్లోనే ఆనందాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టాను. మరీ ముఖ్యంగా.. బన్నీ నన్ను ట్విటర్‌లో బ్లాక్ చేసినా, నాకేమీ బాధగా అనిపించడం లేదు’’ అన్నట్టుగా ట్వీట్ చేసింది. దీంతో.. నీ కెరీర్ ముందుకు సాగకపోవడానికి బన్నీని బ్లేమ్ చేస్తున్నావా? అంటూ ఫ్యాన్స్ ఆమెపై ఎగబడ్డారు. ఇంతలోనే బన్నీ తనని అన్‌బ్లాక్ చేశాడంటూ మరో ట్వీట్ చేసింది. అంతేకాదు.. తన కెరీర్‌లోని సమస్యలకి బన్నీని బ్లేమ్ చేయలేదని, సమస్యల్లోనే ఆనందాన్ని వెతుక్కోవడం నేర్చుకున్నానని క్లారిటీ ఇచ్చింది.
Big Breaking: ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..!
అలా క్లారిటీ ఇచ్చినప్పటికీ బన్నీ ఫ్యాన్స్ నుంచి విమర్శలు తగ్గకపోవడంతో.. భానుశ్రీ మరో ట్వీట్ చేసింది. ‘‘బన్నీ అభిమానుల్ని హర్ట్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. నేను కూడా బన్నీ ఫ్యాన్‌నే. నా కెరీర్‌లోని బాధల్ని చూసి నేనే నవ్వుకుంటున్నాను. ప్రేమను పంచుదాం, ద్వేషాన్ని కాదు’’ అంటూ ఒక పెగ్గేస్తూ, అందరికీ గుడ్‌నైట్ చెప్పింది. అయితే.. ఆ పెగ్గేసిన వీడియో తేడా కొడుతుందేమోనన్న ఉద్దేశంతో, ఆ ట్వీట్‌ని భానుశ్రీ డిలీట్ చేసేసింది. కాగా.. వరుడు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భానుశ్రీకి, ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు. హీరోయిన్ పాత్రలు లభించకోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ని కొనసాగిస్తోంది.