Salman Khan Gets Threaten Email From Lawrence Bishnoi: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ సన్నిహితుడైన ప్రశాంత్ గుంజాల్కర్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు గోల్డీ భాయ్ అలియాస్ గోల్డీ బ్రార్ తరఫున వార్నింగ్ మెయిల్ వచ్చింది. అందులో.. ‘‘జైలు నుంచి లారెన్స్ బిష్ణోయ్ ఇచ్చిన ఇంటర్వ్యూని సల్మాన్ చూశాడా? ఒకవేళ చూడకపోతే అతడ్ని ఆ ఇంటర్వ్యూ చూడమని చెప్పు’’ అంటూ పేర్కొని ఉంది. గోల్డీ బ్రాడ్ సల్మాన్‌తో మాట్లాడాలనుకుంటున్నాడని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మెయిల్ రోహిగ్ గార్గ్ అనే వ్యక్తి పేరిట వచ్చింది. ఈ మెయిల్ వచ్చిన వెంటనే సల్మాన్ ఖాన్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లతో పాటు రోహిత్ గార్గ్‌లపై కేసు నమోదు చేశారు.
West Bengal : ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి.. ఆ స్కామ్ వల్లే..?
ఈ బెదిరింపు లేఖ గురించి ప్రశాంత్ గుంజాల్కర్ మాట్లాడుతూ.. ‘‘నేను తరచుగా సల్మాన్ ఇంటికి, ఆఫీస్‌కి వెళ్తుంటాను. శనివారం కార్యాలయానికి వెళ్లినప్పుడు.. సల్మాన్ ఖాన్ పీఏ జోర్డీ పటేల్ ఇన్‌బాక్స్‌లో బెదిరింపు మెయిల్ చూశాను. అందులో ‘నీ బాస్ (సల్మాన్)తో గోల్డీ భాయ్ మాట్లాడాలని అనుకుంటున్నాడు. సల్మాన్ ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ చూసి ఉంటాడని అనుకుంటున్నా. ఒకవేళ చూడకపోయి ఉంటే, చూడమని చెప్పండి. మేటర్ క్లోజ్ చేయాలి. గోల్డీతో సల్మాన్‌ని ఒకసారి మాట్లాడించండి. ఫేస్ టు ఫేస్ అయినా పర్లేదు. ఇప్పుడు సమయం ఉంది కాబట్టి ఇన్ఫామ్ చేస్తున్నాం. మరోసారి ఊహించని పరిణామాలు ఉంటాయి’’ అని రాసి ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ బెదిరింపు లేఖ వచ్చిన పక్షంలో పోలీసులు సల్మాన్‌కి మరింత భద్రత పెంచారు.
Uttarakhand : విద్యార్థుల వీరంగం.. వార్డెన్ పై వేధింపులే కారణం!
కాగా.. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ గతంలోనూ సల్మాన్‌కి ఓ బెదిరింపు లేఖ పంపించాడు. సిద్ధూ తరహాలోనే నిన్ను కూడా చంపుతామని అందులో పేర్కొన్నాడు. అలాగే.. రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తన లక్ష్యం సల్మాన్‌ని చంపడమేనని పేర్కొన్నాడు. తాము దైవంగా భావించే కృష్ణజింకల్ని వేటాడి, తమ మనోభావాల్ని దెబ్బ తీశాడని.. అందుకే అతడ్ని చంపాలని అనుకుంటున్నానని బిష్ణోవ్ వెల్లడించాడు. సల్మాన్‌కి రావణుడి కంటే పొగరు చాలా ఎక్కువగా ఉందని తెలిపాడు. 2018లో కోర్టు ఆవరణలోనే సైతం.. సల్మాన్‌ని హత్య చేస్తానంటూ బిష్ణోయ్ కుండబద్దలు కొట్టాడు.