Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అనిమల్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ లు సృష్టిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 900 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. సినిమా చాలా వైలెంట్ గా ఉంది అంటూనే.. అభిమానులు అనిమల్ కు క్యూ కడుతున్నారు. సందీప్ రెడ్డి మేకింగ్.. రణబీర్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక మ్యూజిక్, బీజీఎమ్ ల గురించి అసలు చెప్పాల్సినవసరం అస్సలు లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేయడం ఆలస్యం.. అవే మ్యూజిక్ వీడియోలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. అనిమల్ ట్విట్టర్ హ్యాండిల్ అడ్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా సినిమాకు సగం హైప్ తెచ్చింది అంటే.. వారే. అభిమానులు అడిగిన తిక్క తిక్క ప్రశ్నలకు అందుకు తగ్గట్టుగానే సమాధానాలు చెప్పి.. హైలైట్ గా నిలిచారు.
ఇక తాజాగా మరోసారి తమ చమత్కారంతో అనిమల్ ట్విట్టర్ అడ్మిన్ హైలైట్ గా నిలిచాడు. నిన్నటికి నిన్న.. అనిమల్ సినిమాపై నెగెటివ్ రివ్యూ ఇచ్చిన నెటిజన్ ను ట్యాగ్ చేసి కలక్షన్స్ పోస్టర్ ను షేర్ చేశారు. ఇక తాజాగా ఒక అభిమాని.. ఆ కలక్షన్స్ పోస్టర్ ను వాటర్ మార్క్ లేకుండా పోస్ట్ చేయమని అడిగాడు. ఆ పోస్టర్ లో రణబీర్.. బాబీ డియోల్ క్లైమాక్స్ ఫైట్ లో షర్ట్ లేకుండా రక్తంతో నిలబడి ఉన్నారు. ఇక దానికి అనిమల్ అడ్మిన్.. నీకు ఈ పిక్ తో ఏంటి రా పని అంటూ సెటైర్ వేసాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఏందయ్యా అడ్మినూ.. ఇచ్చిపడేస్తున్నావ్ గా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Neeku ee pic toh enti ra pani? https://t.co/pdfs2xDYMU
— Animal The Film (@AnimalTheFilm) December 18, 2023