Mana Shankara Varaprasad Garu : మాస్, ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బర్త్ డే నేడు. ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగకుండా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్.. ప్రజెంట్ చిరంజీవితో మన శంకర వర ప్రసాద్ గారు తీస్తున్న సంగతి తెలిసిందే కదా. మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అనిల్ బర్త్ డే సందర్భంగా మేకింగ్ వీడియోను స్పెషల్ గా రిలీజ్ చేశారు. ఇందులో చిరు సందడి మామూలుగా లేదు. అసలే చిరంజీవి అంటే టైమింగ్ కు మారు పేరు. ఇక ఆయన ఎక్కడుంటే అక్కడ సందడి బాగానే ఉంటుంది.
Read Also : iBomma Ravi : 15 రోజులకో టూర్.. లగ్జరీ లైఫ్.. రవి లైఫ్ స్టైల్ ఇదే
మేకింగ్ వీడియోలో అనిల్ రావిపూడి ఎలా డైరెక్ట్ చేస్తున్నాడో.. సెట్స్ లో ఎంత సందడిగా చిరు, అనిల్, మిగతా యాక్టర్లు గడుపుతున్నారో మనకు కనిపిస్తోంది. ఇక వీడియో చివర్లో.. పిండేస్తున్నాడయ్యా అంటూ చిరంజీవి అనిల్ గురించి చేసిన కామెంట్ ను వదిలారు. ఈ మేకింగ్ వీడియో ఇప్పుడు క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా చిరంజీవి, అనిల్ రావిపూడి సరదగా గడుపుతున్నారు. ఇది ఒకరకంగా మంచి ప్రమోషన్ కంటెంట్ ఇచ్చినట్టే అంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది.
Read Also : Jabardasth Naresh : చెత్త అమ్ముకుంటూ బతికా.. జబర్దస్త్ నరేశ్ ఎమోషనల్