iBomma Ravi : తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో నాలుగో రోజు కస్టడీ ముగిసింది. పోలీసులు కీలక విషయాలను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రవి మాత్రం పర్సనల్ విషయాలు మాత్రమే చెబుతున్నాడు. పైరసీ నెట్వర్క్ గురించి నోరు విప్పట్లేదు. కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ గురించి బయట పెట్టాడు. పైరసీ ద్వారా వచ్చిన డ్బబులను ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టినట్టు తెలిపాడు. ప్రతీ 15-20 రోజులకు ఒక్కో దేశం చొప్పున తిరిగాడు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, దుబాయ్ దేశాలకు టూర్లు వేశాడు.
Read Also : Jabardasth Naresh : చెత్త అమ్ముకుంటూ బతికా.. జబర్దస్త్ నరేశ్ ఎమోషనల్
సెయింట్ కిట్స్, నెవిస్ పౌరసత్వం తీసుకున్నాడు. విదేశాల్లో ఉన్న సోఫిస్టికేటెడ్ సర్వర్ల ద్వారా పైరసీ నెట్‌వర్క్ ను నడిపాడు. రవికి చెందిన ఒక బ్యాంక్ ఖాతాలో 3.5 కోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో, వైజాగ్ లో రవికి ఎంతో విలువైన ఆస్తులు ఉన్నాయి. బిజినెస్ క్లాస్ ట్రావెల్ ఫ్లైట్లలో తిరుగుతూ లగ్జరీ హోటల్స్ లో గడుపుతున్నాడు రవి. ఒంటరిగానే ఉంటూ స్టైలిష్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు రవి. కానీ పైరసీ వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారనేది మాత్రం చెప్పలేదని తెలుస్తోంది.
Read Also : Rajamouli : రాజమౌళి.. డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిందే